సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అనేదానికి మరో నిదర్శనమే ఇది. స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఉన్న అమ్మడు సడెన్ గా కనుమరుగయిపోయి లైఫ్ లో సెటిల్ అయిపోయింది. నిజానికి అమ్మడుపై నెగటివ్ కామెంట్స్ వచ్చిందే లేదు. అమ్మడు సినిమాలు బ్లాక్ బస్టర్ కాకపోయినా ఖచ్చితంగా జనాలను మెచ్చుకునే విధంగానే ఉంటాయి . కానీ ఇలాంటి టైంలోనూ ఈ హీరోయిన్ తప్పుచేసి లైఫ్ లో సూపర్ సక్సెస్ అయింది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న లయ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మడు చదువులో సరస్వతి.. అంతేకాదు జాతీయ స్థాయి చదరంగం క్రీడాకారిని . లయలో మనకు తెలియని ఎన్నో టాలెంట దాగున్నాయి. ఎవర్ని హర్ట్ చేయదు.. ఉన్న మాట మాట్లాడుతుంది ..ఈవెన్ , తన జోలికి ఎవరైనా వచ్చినా కానీ సైలెంట్ గా వెళ్ళిపోతుంది . అంతా ఓర్పు సహనం గల ఆడపిల్ల. నిజానికి లయ సినిమా జర్నీ చాలా కొత్తగా సాగింది. లయకు నాలుగో తరగతి చదువుతున్నప్పుడే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాలు చేత అది చేయి జారిపోయింది.
మళ్లీ పదవ తరగతి చదువుతున్నప్పుడు రాఘవేంద్రరావు కొత్త సినిమా కోసం ఆడిషన్స్ జరగడం అందులోని పాల్గొనడం జరిగింది . అయినా కానీ ఆమె సెకండ్ ప్లేస్ లో సరిపెట్టుకోవడంతో ఆ సినిమా అవకాశాలు పోగొట్టుకుంది. ఎట్టకేలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న టైంలో “స్వయంవరం” సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్గా మారింది. ఇక ఆ తర్వాత అమ్మడు తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకునే రోజు లేకుండా పోయాయి. హోంలీ పాత్రలు అంటే టక్కున అందరికీ గుర్తొచ్చేది లయనే అలా హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు కమిట్ అవుతూ క్రేజీ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.
అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ సడెన్ గా ఎవరికి చెప్పకుండానే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. అంతేకాదు పెళ్లి తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మళ్ళీ అభిమానులకు టచ్ లో వస్తుంది . కానీ అంతకుముందు లయ అసలు ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. కాగా ఇలా కెరియర్ పిక్స్ టైమ్స్ లో ఉన్నప్పుడే సినిమా అవకాశాలు వదులుకొని తప్పు చేసినా..లైఫ్ లో మంచి అబ్బాయిని చూస్ చేసుకుని పెళ్లై పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ విషయంలో లయ సూపర్ సక్సెస్ అయిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.