ఎన్టీఆర్ తనయుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ స్టార్ హీరోగా తెలుగులో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ఆరు పదుల వయసులో కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాలు విడుదల చేస్తూ తనను ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నారు బాలయ్య. డైలాగులు, డాన్సులు, ఫైట్లు ఇలా ఏ జోనర్ తీసుకున్న కూడా బాలకృష్ణకు తిరుగే లేదు.అయితే బాలకృష్ణ సైతం కొన్నిసార్లు సినిమా సెలక్షన్స్ లో పొరపాట్లు చేసిన కారణంగా పరాజయాలు చవిచూశాడు. మరి కొన్నిసార్లు కొన్ని హిట్ అయ్యే సినిమాలను సైతం బాలకృష్ణ రిజెక్ట్ చేశాడు. అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహాద్రి :
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలుసు. అయితే ఈ చిత్రాన్ని తొలుత బాలయ్యతో తీయాలని రాజమౌళి భావించినా కూడా అందుకు బాలకృష్ణ ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా తారక్ చేతికి వెళ్ళింది.
స్టూడెంట్ నెంబర్ 1 :
రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా స్టూడెంట్స్ నెంబర్ 1. ఈ చిత్రాన్ని సైతం బాలకృష్ణతో తీయాలనే రాజమౌళి అనుకున్నాడట. కానీ బాలకృష్ణ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నారట. అలా ఒక బ్లాక్ బస్టర్ సినిమా నుంచి బాలయ్య తప్పుకున్నాడు. ఈ సినిమాలో బాలయ్యను ముందుగా స్టూడెంట్‌గా కాకుండా ప్రొఫెసర్‌గా అనుకుని.. జైలు బ్యాక్‌డ్రాప్ అనుకున్నారు.
సూర్యవంశం :
విక్టరీ వెంకటేష్ డ్యుయల్ రోల్ లో నటించిన సినిమా సూర్యవంశం. ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలను సాధించి బ్లాక్ బస్టర్ సినిమా గా నిలిచింది. ఈ సినిమాలో మీనా, రాధిక హీరోయిన్స్ గా నటించగా 1998లో వచ్చి ప్రభంజన సృష్టించింది. అయితే మొదట ఈ సినిమాను దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు బాలకృష్ణతో తీయాలని అనుకున్నారట. కానీ ఎందుకో కుదరకపోవడంతో దీని నుంచి ఆయన తప్పుకున్నారు.
సింహరాశి :
రాజశేఖర్ ను హీరోగా నిలబెట్టిన సినిమా సింహరాశి. ఈ చిత్రం సముద్ర దర్శకత్వంలో రాగా, మొదట బాలక్రిష్ణ తో తీయాలని సముద్ర భావించారట. కానీ బాలకృష్ణ అందుకు నో చెప్పడంతో ఈ సినిమా రాజశేఖర్ దగ్గరికి వెళ్ళింది. ఇక ఈ సినిమా 2001లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.
నాగవల్లి :
వెంకటేష్ హీరోగా నటించిన చంద్రముఖి సీక్వెల్ సినిమా నాగవల్లిలో తోలుత బాలకృష్ణ నటించాలని సినిమా యూనిట్ అనుకున్నప్పటికీ బాలకృష్ణ తిరస్కరించడంతో చివరికి ఈ చిత్రం వెంకటేష్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఈ సినిమా విడుదల అయ్యి ఫ్లాప్ అయ్యింది.
అన్నవరం :
బాలకృష్ణ వద్దని చెప్పిన మరొక సినిమా అన్నవరం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. వాస్తవానికి ఇది తమిళ రీమేక్ సినిమా. అందుకే బాలకృష్ణ ఈ సినిమాకి నో చెప్పడంతో ఈ చిత్ర దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు చిరంజీవి తో చేయాలని అనుకున్నాడు. కానీ ఈ చిత్రం తనకంటే పవన్ కళ్యాణ్ కి బాగుంటుంది అని చిరంజీవి చెప్పడం తో చివరగా పవన్ దగ్గరికి వెళ్ళింది.
వకీల్ సాబ్ :
బాలీవుడ్ లో తెరకెక్కిన పింక్ సినిమాకి రీమేక్ గా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా వకీల్ సాబ్. ఈ చిత్రం కూడా మొదట బాలకృష్ణ చేయాల్సి ఉండగా రీమేక్ సినిమాల్లో నటించడానికి బాలకృష్ణ నిరాకరించాడు. దాంతో దిల్ రాజు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో చేయించాడు.