బుల్లితెరపై జబర్దస్త్ షో కి ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. రోడ్డు మీద పడి ఉన్న నార్మల్ కమెడియన్స్ తీసుకొచ్చి స్టార్ కమెడియన్స్ గా తీర్చిదిద్ది వాళ్ళ కెరియర్ ని సెటిల్ చేసిన ఘనత జబర్దస్త్ కి దక్కుతుంది. ఈ షో గురించి చాలామంది పాజిటివ్ గా చెప్పిన వాళ్లే ఉన్నారు. కాగా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షో గురించి నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. షోలో టీం లీడర్స్ ని ఒకలాగా కంటెస్టెంట్ ని ఒకలాగా చూస్తారని ఫూడ్ కూడా సరిగా పెట్టరని.. రెమ్యూనరేషన్ విషయంలో అన్యాయంగా బిహేవ్ చేస్తారని ..చాలా కామెంట్స్ వినిపించాయి.
అంతేకాదు కొందరైతే ఈ షో నుంచి తప్పుకునేశారు. మళ్లీ వెనక్కి వస్తున్నారు అది వేరే రీజన్స్ అయినా ..షో ని మాత్రం డౌన్ చేయడానికి కొందరు బాగా ట్రై చేశారు. కానీ తనదైన స్టైల్ లో షో ని మళ్లీ ముందుకు తీసుకెళ్తున్నాడు షో మేనేజర్ ఏడుకొండలు. కాగా జబర్దస్త్ షో స్టార్టింగ్ నుంచి కొనసాగుతున్న కమెడియన్ రాంప్రసాద్ రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాంప్రసాద్ ఒక్క స్కిట్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అనే విషయం పై జనాలు చర్చించుకుంటున్నారు.
రాంప్రసాద్ స్క్రిప్ట్ రైటర్. మిగతా టీం లీడర్స్ కూడా స్క్రిప్స్ రాయిస్తూ ఉంటారు . దీని పరంగా ఆయన జబర్దస్త్ నుండి ఎక్కువ సంపాదించుకుంటున్నాడు. అంతేకాదు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆయన స్కిట్స్ వేస్తాడు. ఈ కారణంగా ఆయన తన ఆస్తిని ఎక్కువ పెంచుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు రాంప్రసాద్.. సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం రాంప్రసాద్ ఒక్క స్కిట్ కి ₹1,50,000 తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది టైంలోనే జబర్దస్త్ రాంప్రసాద్ ఎన్ని కోట్ల ఆస్తిని వెనకేసుంటాడు ఊహించుకోవచ్చు.