టాలీవుడ్ లో యాంకర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో విష్ణు ప్రియ కూడా ఒకరు. విష్ణు ప్రియ యాంకర్ గా కంటే హాట్ యాంకర్ గా చాలా పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ప్రదర్శన అంతా ఇంతా కాదు. దాదాపు హీరోయిన్ ల రేంజ్ లో విష్ణు ప్రియ ఎక్స్ పోజింగ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో హాట్ ఫోటోలకు పోజలు ఇవ్వడంతో పాటూ ఐటమ్ పాటలకు స్టెప్పులు వేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. మొదటగా విష్ణు ప్రియ యాంకర్ సుధీర్ తో కలిసి పోవే పోరాతో కెరీర్ ను ప్రారంభించింది. గట్టి గట్టిగా అరుస్తూ అల్లరి పిల్లలా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.
యాంకర్ గా మొదట అభిమానులను సంపాదించుకున్నప్పటికీ శ్రీముఖి, అనసూయ రేంజ్ లో మాత్రం ఈ అమ్మడికి ఆఫర్ లు రాలేదు. కారణం ఏంటో తెలియదు కానీ ఇప్పటికీ ఈ హాట్ బ్యూటీ ఆఫర్స్ కోసం తిప్పలు పడుతూనే ఉంది. ఇక యాంకర్ గా ఆఫర్ లు రానప్పటికీ సినిమాలు వెబ్ సిరీస్ లు మాత్రం చేస్తూ కాస్త బిజీగానే ఉంది. ఇక రీసెంట్ గా విష్ణు ప్రియ ఓ సినిమాలో నటించడంతో పాటూ ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తనకు హీరో అఖిల్ అంటే ఎంతో పిచ్చో చెప్పింది. అఖిల్ తో ఒక్క ఛాన్స్ కావాలంటూ డైరెక్టర్ లను రిక్వెస్ట్ చేస్తోంది. తనకు అఖిల్ తో జన్మజన్మల అనుబంధం ఉందని చెప్పింది. అఖిల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని తాను ఓ మోస్తరు డ్యాన్సర్ అని… అఖిల్ డైరెక్టర్ లు ఎవరైతే ఉన్నారో ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరింది. అక్కడితో ఆగకుండా అఖిల్ తో డ్యాన్స్ చేసే ఒక్క అవకాశం ఇప్పించాలంటూ చేతులు జోడించి మరీ వేడుకుంది.
ఇదిలా ఉండగా విష్ణు ప్రియ యాంకర్ అయినప్పటికీ చాలా సార్లు ఇంటర్వ్యూలలో తాను అఖిల్ కు వీరాభిమాని అని చెబుతుంది. అంతే కాకుండా అఖిల్ సినిమాలు వచ్చినా కూడా బర్త్ డే వచ్చినా అతడి ఫోటోలను షేర్ చేస్తూ లవ్ చూపిస్తుంది. ఇక విష్ణు ప్రియ అంతలా వేడుకుంటుంది మరి డైరెక్టర్ లు అఖిల్ తో ఒక్క ఛాన్స్ ఇప్పిస్తారో లేదో చూడాలి.