టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల ముద్దుగా బన్నీ అంటూ పిలుచుకుంటారు . మొదట డాడీ సినిమాతో కనిపించిన బన్నీ ఆ తరువాత గంగోత్రి సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యారు. మొదటి సినిమాతోనే తనదైన స్టైల్ లో అభిమానులను సంపాదించుకున్న బన్నీ ఇక ఆ తర్వాత డాన్స్ పెర్ఫార్మన్స్ ఇరగదీస్తూ టాలీవుడ్ లో డాన్స్ అంటే మొదట అందరికీ గుర్తొచ్చే విధంగా తన పేరును క్రియేట్ చేసుకున్నారు.
రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ ..ఇప్పుడు తన నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండాలని ఆశపడుతున్నారు. అఫ్కోర్స్ బన్ని ఫాన్స్ కూడా అదే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు .కాగా మరికొద్ది రోజుల్లో పుష్ప 2 సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. కాగా ప్రజెంట్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న బన్నీ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది.
మనం అనుకుంటాం డబ్బున్న స్టార్ హీరోస్ దేనినైనా దుబారా చేస్తారని ..ఎంతైనా ఖర్చు పెడతారని ..బట్ బన్నీ ఆ కేటగిరీలోకి రారు ఎందుకంటే ..బన్నీ ప్రతి రూపాయిని ఆచి తూచి ఖర్చు పెడతారట. అంతేకాదు ఇప్పటికీ అల్లుఅయ్యాన్ కి, అర్హా కి రూపాయి విలువ చెప్తారని వేస్ట్ చేయకూడదని ..మరీ ముఖ్యంగా ఎవరైనా సరే ఫుడ్ ని వేస్ట్ చేస్తే ఆయనకు చెడ్డ చిరాకు వస్తుందట. అంతేకాదు బన్నీ ఇంట్లో అందరితో కలిసి భోజనం చేసే టైంలో కచ్చితంగా పిల్లలకు కూడా అన్నం ఎంత విలువైందో అని చెప్పుకొస్తూ ఉంటారట ,
అయాన్ కానీ అర్హ కానీ అన్నం వదిలేస్తే అరిచేస్తారట . ఈవెన్ స్నేహా అలా చేసిన కూడా బన్ని సహించడట లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారట అన్నం విలువ తెలుసుకోండి అన్నం ఎంత కష్టపడితే వస్తుందో తెలుసుకోండి అంటూ పెద్ద క్లాసే పీకుతారట . అఫ్ కోర్స్ బన్నీ చెప్పేది మంచికే కదా అంటున్నారు అభిమానులు . మరి చూడాలి పుష్ప2తో బన్నీ తన ఖాతాలో ఎలాంటి హిట్ వేసుకుంటారో..?