సినిమాల్లోనూ వివాదాలు ఉంటాయి. ఇవి అప్పుడు.. ఇప్పుడు ఎప్పుడూ.. కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవికి, మోహన్‌బాబు వర్గాలకు మధ్య వివాదం ఉందనే విషయం టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోం ది. అదేవిధంగా గతంలోనూ.. ఇలాంటి విభేదాలు.. వివాదాలు ఉన్నాయని.. గుమ్మడి వెంకటేశ్వరరావు రాసుకున్న తీరి గురుతులు-చేదు జ్ఞాపకాలు.. పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సినీ రంగాన్ని దిగ్విజయంగా ఏలిన ఇద్దరు పెద్దహీరోలు.. అక్కినేని నాగేశ్వరరావు.. ఎన్టీఆర్.
ఈ ఇద్దరు కూడా ఒకే జిల్లా కృష్ణా నుంచి మద్రాస్‌కు వెళ్లి.. సినిమాల్లో అవకాశం దక్కించుకున్నారు. పౌరాణిక, జానపద చిత్రాల్లో అన్నగారు.. ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే అక్కినేని సాంఘిక సినిమాల్లో వెలిగారు. ఇద్దరిదీ ఒకేస్థాయి. ఎవరూ ఎవరికీ తీసిపోరు. పైగా స్నేహితులుగా కూడా మెలిగారు. అయితే.. ఇద్దరి మధ్య తీవ్ర వివాదాలు.. సాగాయని గుమ్మడి పేర్కొన్నారు. దీనికి కారణం.. 1960లలోనే అక్కినేని హైదరాబాద్‌కు రావడం.
ఇక్కడ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దల సూచనల మేరకు.. అక్కినేని హైదరాబాద్‌కు తరలి వచ్చేశారు. ఈ క్రమంలో ఆయన షూటింగులు కూడా ఇక్కడే పెట్టుకునేవారు. అయితే.. ఎన్టీఆర్ మాత్రం తమిళనాడులోని సినీరంగంతో పెనువేసుకున్న బంధం కారణంగా.. అక్కడే ఉండిపోయారు. అడపాదడపా మాత్రమే అది కూడా షూటింగుల కోసమే.. హైదరాబాద్ వచ్చేవారట. దీంతో సినీరంగం వారు.. హైదరాబాద్ రావడం లేదని.. ఎన్టీఆర్‌పై వ్యాఖ్యలు చేసేవారు.
ఇక, క్షేత్రస్థాయిలో ఇరువురు హీరోల ఫ్యాన్స్ కూడా.. రెండు వర్గాలుగా విడిపోయి.. అక్కినేని వల్లే.. ఎన్టీఆర్‌కు బ్యాడ్ నేమ్ వస్తోందని.. ఆయన హైదరాబాద్‌కు రాకుండా ఉంటే.. సమస్య ఉండేది కాదని.. ప్రచారం చేసేవారట. ఇక, అక్కినేని అభిమానులు ఎన్టీఆర్‌పై కారాలు మిరియాలు నూరేవారట. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగి.. దాదాపు ఆరేళ్ల వరకు కలిసి సినిమాలు చేయలేదని.. గుమ్మడి చెప్పారు. అయితే.. తర్వాత.. కాలంలో ఎన్టీఆర్ స్వయంగా హైదరాబాద్‌కు రావడం.. అప్పుడు.. మళ్లీ అక్కినేనితో మాట్లాడడం జరిగాయని పేర్కొన్నారు.