టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఐదు దశాబ్దాలుగా చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ గా కొనసాగుతున్నారు. పదేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా కూడా చిరంజీవి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక దివంగత అతిలోకసుందరి శ్రీదేవి అంటే దేశవ్యాప్తంగా తెలియని సినీ ప్రేమికులు ఉండరు.
తెలుగు సినిమా ఇండస్ట్రీని 1980-90 దశకాల్లో తన అందచందాలతో శ్రీదేవి ఒక ఊపు ఊపేసింది. తెలుగుతో పాటు తమిళం – మలయాళం సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాక శ్రీదేవి నేషనల్ వైడ్‌గా పాపులర్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె వెనక తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయాక శ్రీదేవి తెలుగు, తమిళ సినిమాల్లో చేసేందుకు చాలా కండిషన్లు కూడా పెట్టేదన్న ప్రచారం అప్పట్లో జరిగింది.
శ్రీదేవి బాలీవుడ్‌లో పాపులర్ అయ్యాక చిరంజీవితో రెండు సార్లు చేసే ఛాన్స్ వచ్చినా ఆమె పెట్టిన కండీషన్ల వల్లే ఆ రెండు సినిమాలు ఆగిపోయాయన్న ప్రచారం ఉంది. చిరు – శ్రీదేవిది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరు ముందుగా మోసగాడు సినిమాలో నటించారు. ఆ తర్వాత రాణికాసులరంగమ్మ, జగదేకవీరుడుఅతిలోకసుందరి, ఎస్పీ పరశురామ్ సినిమాలు చేశారు. శ్రీదేవి హిందీలో స్టార్ట్ అయ్యాక చిరుతో రెండు సార్లు ఛాన్స్ వస్తే సినిమాలో హీరో కన్నా తన పాత్రకే ప్రాధాన్యం ఉండాలని… ఇక రెమ్యునరేషన్‌తో పాటు ఇతర సౌకర్యాలు కావాలని డిమాండ్ చేయడంతో చాలా తెలుగు సినిమాలు ఆమె మిస్ చేసుకుంది. ఆమె కండీషన్ల వల్లే చిరు – శ్రీదేవి కాంబోలో రెండు సినిమాలు ఆగిపోయాయి.
వజ్రాల దొంగ:
ఈ సినిమాను శ్రీదేవి తానే నిర్మాతగా మారి నిర్మిస్తానని చెప్పారట. అయితే తాను నిర్మాతను కాబట్టి.. హీరో కన్నా తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని చెప్పారట. దీంతో చిరంజీవి ఒప్పుకోలేదట. దీంతో ఈ సినిమా ఆగిపోయింది.
కొండవీటి దొంగ:
ఈ సినిమాలో శ్రీదేవిని ముందుగా హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే శ్రీదేవి టైటిల్ మార్చమన్న కండీషన్ పెట్టిందట. కొండవీటి దొంగకు బదులుగా… కొండవీటిరాణి… కొండవీటిదొంగ అని పెట్టమని.. తనకు హీరోతో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కోరిందట. అందుకు దర్శక, నిర్మాతలు ఒప్పుకోలేదు. అలా రెండుసార్లు శ్రీదేవి కండీషన్ల వల్లే చిరుతో సినిమాలు మిస్ అయ్యాయి.