విశ్వ నటుడు కమల్ హాసన్ కెరీర్లో ఎన్నో విభిన్నమైన సినిమాలను చేసిన సంగతి తెలిసిందే. క్లాస్ అండ్ మాస్ సినిమాలతో ప్రయోగాలు చేయాలంటే కమల్ ముందు ఉంటారు. దశావతారం లాంటి సినిమా చేయాలంటే చాల ధైర్యం కావాలి. విశ్వ రూపం లాంటి సినిమాలతో మెప్పించాలంటే కమల్ వల్లే సాధ్యమవుతుంది. సాగర సంగమం, శుభ సంకల్పం..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి.
అయితే, కమల్ హాసన్‌కు రొమాంటిక్ హీరో అనే పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ఆయన నటించిన చాలా సినిమాలలో హీరోయిన్‌తో పెదవి ముద్దు తప్పకుండా ఉంటుంది. ఆ రోజుల్లో హీరోయిన్లతో తెరమీద కమల్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంటే ఓ రేంజ్లో ఉండేది. ఇక కమల్ పెదవి ముద్దు విషయంలో కమల్ గానీ, ఆ చిత్ర దర్శకుడు గానీ, సినిమాలో నటించే హీరోయిన్‌కి ముందే చెప్పేస్తారు. అక్కడ ఉంది కమల్ హాసన్ కాబట్టి కాదనే ప్రసక్తే లేదు.
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ గురించి మాట్లాడుకుంటారు గానీ, ఆయనకంటే ముందే హీరోయిన్స్‌ను ముద్దడటంలో ఆరితేరారు కమల్. అయితే, ఆయనంత రొమాంటిక్ పర్సన్ శృతి హాసన్ కాదని అంటున్నారు. నట వారసురాలిగా బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శృతి అక్కడ సెటిలవలేదు. సౌత్‌లో చాలా సినిమాలు హీరోయిన్గా చేసినా అవి ఫ్లాపవడంతో ఐరెన్ లెగ్ అనే పేరు వచ్చేసింది.
ఇక శృతి ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగడం కష్టం అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ సినిమా సక్సెస్‌తో శృతి స్టార్ హీరోయిన్గా మారింది. అయితే, పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తుంది గానీ, తండ్రి మాదిరిగా రొమాంటిక్ క్యారెక్టర్స్ గానీ, డీప్ లిప్ కిస్సులు గానీ ఉండే సన్నివేశాలలో నటించడం లేదు. మహా అయితే, ఒకటీ రెండు సినిమాలలో కాస్త రొమాన్స్ చూపించి గానీ, పూర్తి స్థాయిలో కమల్ మాదిరిగా ప్రతీ సినిమాలో హీరోకి పెదవి ముద్దులు ఇచ్చే సీన్స్ చేయలేదని చెప్పొచ్చు.
అందుకే, తండ్రి రేంజ్ రొమాన్స్ శృతి హాసన్ చేయడం లేదనే ఎక్కువ మంది సినీ విశ్లేషకులు, క్రిటిక్స్ అంటూ ఉంటారు. ప్రస్తుతం శృతీ బాలయ్య, చిరంజీవితో పాటు ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తోంది. ఈ మూడు సినిమాలు క్లిక్ అయితే తన సెకండ్ ఇన్సింగ్స్ తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వొచ్చనే శృతీ భావిస్తోంది.