సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్క హిట్ పడిన హీరోయిన్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. హీరో రెమ్యునరేషన్‌లో సగం కూడా ఉండకపోయినా కూడా కొందరు హీరోయిన్స్ మాత్రం సినిమాకు కలిసొచ్చే అంశాలుగా మేకర్స్ భావిస్తున్నారు. సక్సెస్‌లలో ఉన్న హీరోయిన్ వెనక మేకర్స్ ఎంతగా వెంటపడుతున్నారంటే ఒక్క సినిమా తర్వాత కోటి డిమాండ్ చేసినా ఏమీ మాట్లాడటం లేదు. అయితే, ముంబై మోడల్స్ ఎక్కువగా మన సౌత్‌కి హీరోయిన్స్‌గా పరిచయమవుతున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎక్కువగా ముంబై సరుకు దిగుతోంది.
ముంబై నుంచి వచ్చే మోడల్స్ మొదటి సినిమాకు మహా అయితే 5 నుంచి 10 లక్షల వరకే రెమ్యునరేషన్ ఇస్తారు. మరీ బెంగుళూరు భామలైతే 10 లక్షల లోపే. మీడియం బడ్జెట్ లేదా చిన్న బడ్జెట్ సినిమా అంటే 5 లక్షల లోపే. అయితే, ఒక సినిమా ఒప్పుకునే ముందు నిర్మాతలు ఇప్పుడు కచ్చితంగా కొన్ని రూల్స్ పెడుతున్నారు. సినిమా ఏదైనా కాస్ట్యూంస్ విషయంలో ఎలాంటి నిబంధనలు పెట్టకూడదని. కనీసం ఒక్క సీన్స్‌లో అయినా హీరోరో పెదవి అందుకోవాలి.
అలాగే, సాంగ్స్‌లో వీలైనంతగా అందాల ప్రదర్శన ఉండాలి. ఇక వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండేలా ముందే మాట్లాడుకుంటున్నారు. దర్శకుడు హీరోయిన్, నిర్మాత హీరోయిన్, హీరో హీరోయిన్ ఇలా ఎవరో ఒకరి అండ ఉంటే వారికి బాగా సపోర్ట్ చేస్తే వారి గురించి స్టేజ్ మీద బాగా పొగిడితే ఆ అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుంటారు. భాష రాని హీరోయిన్స్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారు. కానీ, అదంతా ఎవరికీ అవసరం లేదు.
కావాల్సింది. మొదటి సినిమా నుంచి టాలెంట్ కాకుండా కొన్ని ఎక్స్ ట్రా టాలెంట్‌లు ఉండాలి. అవి ఉండాలని ముందే మాట్లాడుతున్నారు. వాటికి సై అన్న హీరోయిన్ ఇప్పుడు అవకాశాలు బాగా అందుకుంటుంది. అదృష్ఠం బావుండి మొదటి సినిమా హిట్ అయితే, అవకాశాలకేమీ కొదవ ఉండదు. మిగతా విషాలలో కూడా సహకరిస్తే ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతుంది. లేదంటే తీసి పక్కన పెట్టడం పెద్ద విషయమేమీ కాదు. దీనికి ఉదాహరణ స్టార్ హీరోయిన్స్‌గా వెలిగి ఫ్లాప్స్ వచ్చిన వారే.