Moviesమొదటి భర్తతో విడాకులు రెండో పెళ్లి అలా... వెంకటేష్ హీరోయిన్ జీవితం...

మొదటి భర్తతో విడాకులు రెండో పెళ్లి అలా… వెంకటేష్ హీరోయిన్ జీవితం ఇంత విషాద‌మా..!

ఒకప్పటి అందాల తారలలో హీరోయిన్ ప్రేమ కూడా ఒకరు. వెంకటేష్ హీరోగా నటించిన ధర్మ చక్రం సినిమాతో ప్రేమ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆమె స్వ‌త‌హాగా క‌న్న‌డ అమ్మాయి. చిన్న వ‌య‌స్సులోనే క‌న్న‌డ‌లో పాపులారిటీ రావ‌డంతో ఆ త‌ర్వాత ఆమె తెలుగులో కూడా హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ తరవాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ దేవి సినిమాతో ప్రేమకు మంచి గుర్తింపు వచ్చింది. టాలీవుడ్ తో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా మంచి అవకాశాలను అందుకుంది. చాలా మంది హీరోయిన్ల‌ లాగే ప్రేమ కూడా కొన్ని సినిమాల తరవాత సినిమాలకు దూరం అయ్యింది.

Dharmachakram Full length Movie | Venkatesh | Prema | Ramya Krishna |  Suresh Productions - YouTube

నిజానికి హీరోలకు వయసు పెరిగినా రిటైర్మెంట్ ఉండదు కానీ హీరోయిన్స్ అలా కాదు. కొద్దిగా వయసు పెరిగింది అంటే హీరోయిన్ అవకాశాలు తగ్గుముఖం పడతాయి. అదే విధంగా ప్రేమ కూడా సినిమాలకు దూరం అయ్యింది. అంత‌కు ముందే ప్రేమ క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర‌తో కొద్ది రోజులు ప్రేమాయ‌ణం న‌డిపింది. ఉపేంద్ర ప్రేమ‌ను పిచ్చ‌పిచ్చ‌గా ప్రేమించేశాడు. త‌ర్వాత స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో వారు బ్రేక‌ప్ చెప్పేసుకున్నారు.

Prema, who came as Mohanlal's heroine, is getting ready for marriage again;  Says the actress - The Post Reader

ఇక ప్రేమ 2006 సంవత్సరం లో జీవన్ అప్పచ్చు అనే వ్యాపారవేత్త ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక తన పెళ్లి విడాకుల గురించి ప్రేమ ఎప్పుడూ మాట్లాడలేదు అంతే కాకుండా పెళ్లి విడాకులు లాంటి వ్యక్తిగత విషయాల గురించి తాను మీడియా ముందు మాట్లాడనని చెప్పింది. అంతే కాకుండా గతంలో తాను క్యాన్సర్ భారిన కూడా పడినట్టు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ మహమ్మారి నుండి తాను బయటపడినట్లు తెలిపింది.

రెండో పెళ్లి చేసుకొనున్న స్టార్ హీరోయిన్ ప్రేమ.. అసలు విషయం ఇది! -

తనకు పిల్లలు ఉన్నారు అని ప్రచారం జరిగింది అని కానీ అది కూడా అవాస్తవం అని చెప్పింది. ఇక ప్రేమ మొదటి భర్తతో విడాకులు తీసుకోవడం తో అభిమానులు బాధ పడ్డారు . ప్రేమ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం లో అడుగుపెడుతుంది అనుకుంటే అలా కూడా జరగలేదు. ఇక ప్రస్తుతం ఆమె సింగిల్ గానే ఉన్నారు. అంతే కాకుండా సినిమాల్లో తల్లి క్యారెక్టర్లు చేస్తున్నారు. ఎక్కువగా ప్రేమ కన్నడ నాట సినిమాలు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news