నిన్నటి తరం మేటి హీరోయిన్లలో జమున ఒకరు. అందంతో మాత్రమే కాదు అభినయంతో కూడా తెలుగు ప్రేక్షకులను ఆమె ఒక ఊపు ఊపేసింది. ఎన్టీఆర్ – జమున కన్నా ఏఎన్ఆర్ – జమున కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో ఏఎన్ఆర్ – జమున కాంబినేషన్‌కు ఒక క్రేజ్ ఉండేది. జమున కెరీర్ ప్రారంభంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఆమె అప్పుడే ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుతున్న రోజులు అవి. తనతో కలిసి నటిస్తున్న ఓ కుర్ర హీరోతో ఆమె ప్రేమలో పడిందన్న టాక్ అప్పట్లో వినిపించింది.
ఆ హీరోని జమున పెళ్లి చేసుకోవాలని అనుకునేదట. కేరీర్ ప్రారంభంలో ఆ హీరో సాన్నిహిత్యాన్ని జమున ఎక్కువగా కోరుకునేదని ఆమె గురించి తెలిసినవారు చెబుతూ ఉంటారు. అయితే ఆమె ప్రేమ మైకాన్ని సీనియర్ నటుడు ఎస్వీఆర్ వదిలించేశారట. గుండమ్మ కథ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు అవి. ఎన్టీఆర్ – అక్కినేని – జమున – సావిత్రి – ఎస్వీ రంగారావు – సూర్యకాంతం తదితరులు నటిస్తున్నారు. ఎస్వీఆర్‌కు ఫుల్లుగా మందు తాగే అలవాటు ఉండేది. ఒకరోజు షూటింగ్ అయిపోయాక ఫుల్లుగా మందు కొట్టిన ఎస్వీ రంగారావు జమున ఉంటున్న గది తలుపు దబా దబాదబా బాదేశారట.
అయితే ఆరోజు రాత్రి అంతా జమునను కూర్చోబెట్టి జీవితం గురించి అనేక విషయాలు ఆమెకు చెప్పడంతో పాటు జీవితంలో పైకి రావాలంటే ఎలాంటి ? జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ ఏ తప్పులు చేయకూడదు పూస గుచ్చినట్టు వివరించారట. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో హీరోయిన్లు ఎవరితో ఎలా ? మెలగాలి అనే అంశంపై జమునకు చాలా సూచనలు చేశారట. అయితే అప్పటికే ఉదయం 5 అవ్వడంతో జమనుకు ఎస్వీఆర్‌పై చాలా చికాకు, కోపం వచ్చేశాయట.
అయితే ఎస్వీఆర్ లేచి వెళ్లిపోతూ ఓ పిల్ల, కుర్ర వెధవ నీతో యవ్వారం గురించి చాలా మంది ఏవేవో చెప్పుకుంటున్నారు. వాడిని అందరూ మరో ఎన్టీఆర్ అవుతారని చెప్పుకుంటున్నారు.. కానీ వాడు మరో తాగుబోతు ఎస్వీఆర్ ఆవుతాడని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆయన వెళ్లిపోయారట. ఎస్వీఆర్ వెళ్లిపోయాక ఆయన చెప్పిన మాటలు జాగ్రత్తగా అవలోకనం చేసుకున్న జమున తాను ప్రేమించిన ఆ కుర్ర హీరోకు ఉన్న మందు తాగే అలవాటే బలహీనతగా మారుతుందని గ్రహించి.. చివరకు అతడితో తన ప్రేమను కూడా క్యాన్సిల్ చేసుకుందట.
ఆ కుర్ర హీరో ఎవరో కాదు హీరో హరనాథ్. తర్వాత అతడు ఫుల్లుగా మత్తుకు బానిసైపోయాడు. చివరకు అతడి సినిమా కెరీర్ నాశనం కావడమే కాదు.. ఈ లోకాన్ని విడిచే వెళ్లిపోయాడు. ఆ నాడు ఎస్వీఆర్ చెప్పిన జాగ్రత్తలు తాను తీసుకుని ఉండకపోతే తన జీవితమే నాశనమైపోయి ఉండేదని జమున చాలా సందర్బాల్లో చెప్పారు.