సుధీర్‌బాబు, కృతిశెట్టితో పాటు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్టర్ అనగానే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాపై కాస్త మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా కథ చూస్తే నవీన్( సుధీర్‌బాబు ) సినీ ఇండస్ట్రీ లో ఓ యంగ్ హిట్ డైరెక్టర్. తన సినిమాలో హీరోయిన్ కోసం వెతికే క్రమంలో ఓ డాక్టర్ అలేఖ్య (కృతి శెట్టి) నుంచి ఓ వీడియో చూసి అమితంగా ఇంప్రెస్ అవుతాడు. ఆమెనే తన సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకోవాలని ఫిక్స్ అవుతాడు. మరి ఆమెను తన సినిమాలో హీరోయిన్‌గా ఒప్పించే క్రమంలో ఏం జరిగింది ? ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి… చివరకు ఈ సినిమా కథేంటి ? అన్నదే స్టోరి.
ఈ సినిమాలో దర్శకుడు ఇంద్రగంటి సుధీర్‌బాబు చుట్టూ మంచి పాత్రను డిజైన్ చేశాడు. సినిమాపై మంచి ఫ్యాషన్ ఉన్న ఓ స్టైలీష్ యంగ్ డైరెక్టర్‌గా సుధీర్‌బాబు కనిపిస్తాడు. అలాగే ఎమోషనల్ సీన్లలో కృతిశెట్టి సెలిల్డ్ పెర్పామెన్స్ బాగుంది. సెన్సిబుల్ ఎమోషనల్ సీన్లలో కృతి యాక్టింగ్ బాగుంది. సుధీర్‌బాబుతో ఆమె కెమిస్ట్రీ బాగుంది. సినిమాలో ఎమోషనల్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే సీన్లు.. క్లైమాక్స్ మెప్పిస్తాయి.
ఇక ఇంద్రగంటి గత సినిమాల్లాగానే సినిమా పాయింట్ బాగున్నా స్లో నెరేషన్‌లో నెమ్మదిగా ఉంటుంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌కు ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పడం కష్టం. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వాళ్లు కూడా ఈ సినిమా నుంచి పెద్దగా ఏం ఆశించరు. చాలా సీన్లు రొటీన్‌గానే ఉంటాయి. కొన్ని చోట్ల సీరియల్‌కు పనికి వచ్చే కథను సినిమాగా తీశారా ? అనిపిస్తుంది.
దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి విషయానికి వస్తే డీసెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నటీనటుల నుంచి మంచి నటనే రాబట్టాడు. ఫైనల్గా చూస్తే ఈ సినిమా ఇంద్రగంటి నుంచి వచ్చిన సెన్సిబుల్ డ్రామా అని చెప్పాలి. సమ్మోహనం తరవ్ఆత డీసెంట్ డ్రామా. కాస్త తక్కువ అంచనాలు పెట్టకుని చూస్తే సినిమా ఓకే. అంతకు మించి ఆశించలేం.