తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవిది నాలుగు దశాబ్దాల ప్రస్థానం. 40 సంవత్సరాలలో చిరంజీవి తన కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. పదేళ్ళపాటు సినిమాలకు దూరమై.. రీయంట్రీ ఇచ్చిన చిరు చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. `ఖైదీ నెంబర్ 150`, `సైరా` లాంటి సినిమాలతో తన మార్కెట్ స్టామినా ఏంటో చిరు ప్రూవ్ చేసుకున్నాడు. చిరంజీవి తన కెరీర్లో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు డైరెక్ట్ చేసిన సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలోనే దర్శకరత్న దాసరి నారాయణరావు చిరంజీవి కాంబినేషన్లో ప్రెస్టేజ్ మూవీ కూడా తెరకెక్కింది.
దాసరి కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాగా తెరకెక్కింది `లంకేశ్వరుడు`. విజయ మాధవి కంబైన్స్ బ్యానర్‌పై వడ్డే రమేష్ నిర్వహణలో కెరకెక్కిన `లంకేశ్వరుడు` సినిమాలో చిరుకు జోడిగా రాధ హీరోయిన్గా నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్ రేవతి చెల్లిగా నటించింది. నందమూరి హీరో కళ్యాణ్ చక్రవర్తి కూడా ఈ సినిమాలో నటించారు. యాక్షన్ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తరకెక్కిన `లంకేశ్వరుడు` అప్పటివరకు వచ్చిన చిరంజీవి సినిమాలతో పోలిస్తే భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
చిరంజీవి సైతం ఈ సినిమాకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ చూసి షాక్ అయ్యారు. ఈ సినిమాకు ముందు వరకు చిరంజీవి సూపర్ డూపర్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నారు. అప్పటికే ఆయనకు మెగాస్టార్ బిరుదు వచ్చింది. ఇటు దాసరి నారాయణరావు సైతం సూపర్ హిట్ సినిమాలతో దర్శకరత్నగా ఉన్నారు. అటు స్టార్ డైరెక్టర్.. ఇటు స్టార్ హీరో కాంబినేషన్లో సినిమా రావడంతో సినీ అభిమానుల్లోనూ ట్రేడ్, వర్గాల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే `లంకేశ్వరుడు` సినిమాకు అదిరిపోయే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు.
కథ, కథనాలు అనుకున్న స్థాయిలో లేకపోవడం.. ఇటు సినిమా సిస్టర్ సెంటిమెంట్ గాను అటు యాక్షన్ నేపథ్యంగాను కాకుండా ఉండటం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలా లంకేశ్వరుడు డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు దాసరికి చిరంజీవికి మధ్య విభేదాలు కూడా పొడచుపాయి. ఇటు చిరంజీవి స్టార్ హీరో… అటు దాసరి స్టార్ డైరెక్టర్ వీరిద్దరి మధ్య కొన్ని సీన్లు షూట్ చేసే విషయంలో బేధాభిప్రాయాలు రావడంతో చివరకు దాసరి షూటింగుకు రాలేదు.
దాసరి లేకపోయినా చిరంజీవి కూడా పంతానికి పోయి మూడు పాటలు సొంతంగానే షూట్ చేసుకున్నారట. అలాగే కొన్ని సన్నివేశాలు కూడా చిరు స్వయంగా చిత్రీకరించారట. అయితే నిర్మాత వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది అంట. అలా ఎన్నో కష్టాలు దాటుకుని రిలీజ్ అయిన.. ఈ సినిమా దాసరికి చిరంజీవికి ఇద్దరికీ వాళ్ళ కెరియర్లో పీడకలగా మిగిలిపోయింది.