Moviesఓరి నాయనో..బన్నీ ఖాతాలోకి రూ.140 కోట్లు..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లిక్డ్ న్యూస్..!?

ఓరి నాయనో..బన్నీ ఖాతాలోకి రూ.140 కోట్లు..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లిక్డ్ న్యూస్..!?

ఓరి నాయనోయ్.. బన్నీ ఖాతాలోకి 140 కోట్లా.. ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ అటు సోషల్ మీడియాని ఇటు ఫిలిం ఇండస్ట్రీస్ ని షేక్ చేస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ కు ఉండే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ ఇండస్ట్రీలోకి గంగోత్రి అనే సినిమాతో హీరోగా పరిచయమైన ఈ హీరో ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు . కాగా బన్నీ గురించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో లీక్ అయి తెగ హల్చల్ చేస్తుంది. మనకు తెలిసిందే మరి కొద్ది రోజుల్లో పుష్ప2 సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాక ముందే సినిమా గురించిన క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో లీక్ అవుతూ వైరల్ గా మారాయి.

అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2కు బన్నీ 90 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. పుష్ప1 భారీ హీట్ కావడంతో ఈ రేంజ్ లో ఐదు బడా సంస్థల నుంచి యాడ్స్ చేసే ఆఫర్ ను అందుకున్నాడట ఈ హీరో. దాదాపు ఒక్కో యాడ్ కి 9 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది . ఇవి మొత్తంగా చూసుకుంటే పుష్ప2 సినిమా కారణంగా బన్నీ ఖాతాలో 140 కోట్లు పడినట్లు సమాచారం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పుష్ప 2 సినిమా హిట్ అయితే బన్నీ రేంజ్ ఏ రేంజ్ లో మారిపోతుందో అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news