Moviesయస్..అది నిజమే..మేము ఇద్దరం వేరువేరుగా ఉంటున్నాం..బిగ్ బాంబ్ పేల్చిన కృష్ణవంశీ..!!

యస్..అది నిజమే..మేము ఇద్దరం వేరువేరుగా ఉంటున్నాం..బిగ్ బాంబ్ పేల్చిన కృష్ణవంశీ..!!

సినీ ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్న రమ్యకృష్ణ కృష్ణవంశీ దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట..ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారు. అదేంటో తెలియదు కానీ రమ్యకృష్ణ కృష్ణవంశీ విడాకులు తీసుకుంటున్నారంటూ దాదాపు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలను వీళ్ళు ఎప్పటికప్పుడు కొట్టి పడేస్తున్నా… కానీ మళ్ళీ ఎందుకో తెలియదు.. ఆ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గానే మారుతున్నాయి . దానికి కారణం వీళ్ళు దూరంగా ఉండటమే అని తెలుస్తుంది.

మనకు తెలిసిందే హీరోయిన్ రమ్యకృష్ణ అద్భుతమైన నటి. తన అందచందాలతో తన ఎక్స్ట్రా ఆర్డినరీ నటనతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. కేవలం తమిళంలోనే కాదు తెలుగులో, హిందీలో కూడా నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఏ హీరోయిన్ సక్సెస్ అవ్వలేనంత ఫాస్ట్ గా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో తన ఖాతాలు వేసుకుంది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించిన తీరు దర్శకధీరుడు రాజమౌళిని కూడా మెప్పించింది. “ఈ పాత్రకు ముందుగా నేను వేరే వాళ్ళను అనుకొని తప్పు చేశానని.. మీరే ఈ పాత్రకు కరెక్ట్” అంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సంచలనంగా మారాయి.

అంతేకాదు రీసెంట్ గా లైగర్ మూవీ లోను రమ్యకృష్ణ నటన అద్భుతంగా ఉంది. ఈ విషయాన్ని చాలామంది నెటిజన్స్ సినిమా చూసిన జనాలు ఓపెన్ గా చెప్పారు. సినిమాలో హీరో విజయ్ దేవరకొండ తర్వాత హైలెట్ అయిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది రామకృష్ణ దే అని చెప్పాలి . కాగా సినిమాలో ఎంత సక్సెస్ అయిందో .. మ్యారేజ్ లైఫ్ లో కూడా అంతే సూపర్ సక్సెస్ అయింది రమ్యకృష్ణ. అయినా ఎందుకు తెలియదు కానీ తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న డైరెక్టర్ కృష్ణవంశీతో ఆమెకు విభేదాలు ఉన్నాయ్ అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి విషయాలపై రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు కృష్ణవంశీ.

రీసెంట్ గా కృష్ణవంశీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” మా వివాహ బంధం పై చాలా పుకార్లు వస్తున్నాయి. కానీ వాటిలో నిజం లేదు. నేను రమ్య ఎప్పటికీ విడిపోము. మేము కలిసే ఉంటాం. మొదట్లో ఇలాంటి వార్తలు చూసి బాధపడే వాళ్లం. కానీ రాను రాను ఆ వార్తలు చూసి నవ్వుకుంటున్నాం. అందుకే ఇలాంటి వార్తల పై పెద్దగా రియాక్ట్ అవ్వం. కానీ అందులో ఒక వార్త మాత్రం నిజమే.. నేను రమ్యకృష్ణ వేర్ వేరుగానే ఉంటున్నాం. నేను సినిమా షూటింగ్ పనుల్లో హైదరాబాద్లో ఉంటున్నాను. రమ్యకృష్ణ బాబుని చదివించుకుంటూ చెన్నైలో ఉంటుంది . ఖాళీ సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా మేము కలుస్తాం. అంతే తప్పిస్తే మా మధ్య విడాకులు..విబేధాలు ఏమీ లేవు” అంటూ క్లారిటీ ఇచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news