Moviesజ‌గ‌ప‌తిబాబు మాట‌తో వేణు ఎందుకు మోస‌పోయాడు.. ఈ ఇద్ద‌రు హీరోల గొడ‌వ‌కు...

జ‌గ‌ప‌తిబాబు మాట‌తో వేణు ఎందుకు మోస‌పోయాడు.. ఈ ఇద్ద‌రు హీరోల గొడ‌వ‌కు కార‌ణ‌మేంటి…!

టాలీవుడ్ లో సీనియర్ హీరో వేణు రెండు దశాబ్దాల క్రితం సూపర్ హిట్లతో దూసుకుపోయాడు. ముఖ్యంగా వేణు కామెడీ టైమింగ్, రొమాన్స్ అంటే అప్పటి సినిమా ప్రేమికులకు ఎంతో ఇష్టం ఉండేది. స్వయంవరం – చిరునవ్వుతో – హనుమాన్ జంక్షన్ – కళ్యాణ రాముడు లాంటి హిట్ సినిమాలు వేణు ఖాతాలో పడ్డాయి. అప్పట్లోనే మీడియం రేంజ్ హీరోలతో కలిసి వేణు మల్టీస్టారర్ సినిమాలలో సైతం నటించాడు. హనుమాన్ జంక్షన్ లో సీనియర్ హీరోలు జగపతిబాబు – అర్జున్‌తో కలిసి నటించాడు. ముగ్గురు హీరోలు కలిసిన నటించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి సూపర్ హిట్ అయింది.

ఇదిలా ఉంటే హనుమాన్ జంక్షన్ సినిమాలో తనతో పాటు కలిసిన జగపతిబాబు అంటే వేణుకు ఎంతో ఇష్టం ఉండేదట. జగపతిబాబు సీనియర్ నటుడు కావడంతో పాటు… అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి కావడంతో వేణు – జగపతిబాబు మంచి స్నేహితులు అయ్యారు. అయితే ఒకానొక సంఘటన వల్ల వీరిద్దరి మధ్య మాటలు లేని పరిస్థితి తలెత్తింది. గత కొన్ని సంవత్సరాలుగా అసలు ఇద్దరు మాట్లాడుకోవటం లేదట. ఈ విషయాన్ని త‌న తాజా సినిమా రామారావు సినిమా ప్రమోషన్లలో వేణు స్వయంగా చెప్పారు.

ఒక వ్యక్తి వేణుకు ఆ రోజుల్లోనే రు. 14 లక్షల అమౌంట్ ఇవ్వాల్సి ఉందట. అయితే వేణు తన డబ్బుల కోసం ఆ వ్య‌క్తిని ఒత్తిడి చేస్తున్న క్రమంలో జగపతిబాబు మధ్యలో ఎంటర్ అయ్యి నేను హామీ ఇస్తున్నాను.. నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పారట. దీంతో వేణు జగపతిబాబుపై ఉన్న గౌరవంతో తనకు డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తిని డబ్బులు అడగలేదు. అయితే ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా జగపతిబాబు మళ్లీ తాను ఇచ్చిన మాట గురించి వేణు దగ్గర ప్రస్తావించలేదట.

అలా ఆ రోజుల్లో రు. 14 లక్షలు పోగొట్టుకోవటం తనకు చాలా నష్టం కలిగించింద‌ని… మళ్లీ ఆ డబ్బులు గురించి ప్రస్తావన జగపతిబాబు ఏనాడూ తేలేదని… అసలు అప్పటినుంచి తామద్దం కలుసుకోలేదని వేణు చెప్పారు. జగపతిబాబు తనకు మంచి స్నేహితుడు అని చెబుతూనే ఆయన చేసిన పనికి తను ఆర్థికంగా ఎంతో నష్టపోయాను అంటూ పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో రు. 14 లక్షలు అంటే చాలా ఎక్కువ మొత్తం అని కూడా వేణు చెప్పారు.

జగపతిబాబు తనకు సంబంధం లేని విషయంలో మధ్యలో ఎంటర్ అయినా.. తర్వాత ఆ విషయం గురించి ఆయన పట్టించుకోకపోవడంతో తాను భారీగా నష్టపోయినని వేణు తెలిపారు. ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన వేణు ఇక‌పై కంటిన్యూగా సినిమాలు చేస్తాన‌ని చెప్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news