టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి ఆరు దశాబ్దాల సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ వంశం నుంచి ఇప్పటికే మూడోతరం హీరోలుగా నాగచైతన్య – అఖిల్ ఇద్దరు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు వేసిన బలమైన బీజం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆ కుటుంబానికి ఎప్పుడు స్థానం ఉండేలా చేసింది. ఏఎన్ఆర్ తర్వాత ఆయన వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున కూడా నాలుగు దశాబ్దాల పాటు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు నాగార్జున ఇద్దరు వారసులు కూడా హీరోలుగా నిలదొక్కుకున్నారు.
నాగార్జున కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా..! అలాగే ఆయనలో ఎవరికీ తెలియని టాప్ బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు. ఎప్పుడు ఏ రంగంలో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు సంపాదించాలో ? నాగార్జున మంచి ఎక్స్పర్ట్. నాగార్జున విషయానికొస్తే ముందుగా దివంగత లెజెండ్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నారు. అయితే నాగార్జున సినిమాల్లోకి రావడానికి ముందే శ్రీలక్ష్మితో వివాహమైంది. అప్పటికే ఈ దంపతులకు నాగచైతన్య కూడా జన్మించాడు.
ఆ తర్వాత ఆమెతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న నాగార్జున తనతో పాటు శివ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన అమలను మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే అమలను వివాహం చేసుకోవడం ఏఎన్ఆర్ కు ఎంత మాత్రం ఇష్టం లేదట. ఏఎన్ఆర్ ముందు నుంచి వ్యక్తిగతంగా చాలా క్రమశిక్షణతో పెరిగారు. సినిమా రంగంలో ఉన్న వారి వ్యక్తిగత జీవితాలు అంత సక్రమంగా ముందుకు సాగమని ఆయన నమ్మేవారు.
ఏఎన్ఆర్ సినిమాలలో ఉండడంతో ఆయనకు పిల్లని ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదట. చివరకు వాళ్ళ మేనమామలు కూడా పిల్లను ఇచ్చేందుకు ఒప్పుకోలేదట. దీంతో ఆయనకు చాలా లేట్ వయసులో పెళ్లి అయ్యింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ఆయన అప్పటికే ఒక పెళ్లయి విడాకులు తీసుకున్న నాగార్జున… సినిమా రంగంలో ఉన్న అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకుంటే ఎలాంటి ? ఇబ్బందులు వస్తాయో అన్న ఆందోళనతో ఉన్నారట. అందుకే ఏఎన్ఆర్ అమలను తన ఇంటి కోడలుగా స్వీకరించేందుకు ఇష్టపడలేదట.
దీనికి తోడు అమల తెలుగు అమ్మాయి కాదు. ఆమెకు అప్పుడు తెలుగు భాష కూడా సరిగా రాదు. దీంతో నాగార్జునను ఎలా ? అర్థం చేసుకుంటుందో అన్న సందేహం కూడా ఏఎన్ఆర్ కు ఉండేదట. అయితే చివరకు నాగార్జున ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నారు. అయితే ఆ తర్వాత అమల పూర్తిగా అక్కినేని ఫ్యామిలీ విలువలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆ ఇంటి కోడలిగా ఒదిగి పోయింది.