Moviesముగ్గురు పుట్టిన తరవాత ప్రకాష్ రాజ్ భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చాడు...?

ముగ్గురు పుట్టిన తరవాత ప్రకాష్ రాజ్ భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చాడు…?

టాలీవుడ్ లోని విల‌క్ష‌ణ న‌టుల‌లో ప్ర‌కాష్ రాజ్ ఒక‌రు. తెలుగుతో పాటూ త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ ప్ర‌కాష్ రాజ్ సినిమాలు చేస్తుంటారు. తండ్రి, తాత‌, విల‌న్ ఇలా ఏ పాత్ర‌లో అయినా ప్ర‌కాష్ రాజ్ ఒదిగిపోతుంటారు. ఇక త‌న టాలెంట్ కు త‌గిన‌ట్టుగా రెమ్యున‌రేషన్ కూడా అదే రేంజ్ లో పుచ్చుకుంటారు. ప్ర‌కాష్ రాజ్ సినిమా లైఫ్ గురించి చాలా మందికి తెలుసు కానీ ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాత్రం అతిత‌క్కువ మందికి తెలుసు. ప్ర‌కాష్ రాజ్ పోనివ‌ర్మ‌ను రెండో వివాహం చేసుకున్నారు. పోని వ‌ర్మ కొరియోగ్రాఫ‌ర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

నిజానికి ప్ర‌కాష్ రాజ్ మొద‌ట ల‌లిత కుమారిని వివాహం చేసుకున్నారు. పెళ్లైన త‌ర‌వాత ప్ర‌కాష్ రాజ్ ల‌లిత కుమారి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరికి ఇద్ద‌రు కుమార్తెలు ఓ కుమారుడు జ‌న్మించారు. పిల్ల‌లు పుట్టి చాలా కాలం వ‌ర‌కూ ఈ దంప‌తుల సంసారం సాఫీగానే సాగింది. కానీ వీరి చిన్న‌ కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ త‌ర‌వాతే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌కాష్ రాజ్ త‌న కొడుకు చ‌నిపోవ‌డానికి మొద‌టి భార్యనే కార‌ణం అని… ఆమె స‌రిగ్గా చూసుకోక‌పోవ‌డం వ‌ల్లే బాబు చ‌నిపోయాడని ఆరోపించాడు.

అంతే కాకుండా ప్ర‌కాష్ రాజ్ ఓ ఇంట‌ర్వ్యూలో నేను నా భార్య‌కు విడాకులు ఇచ్చాన‌ని పిల్ల‌ల‌కు విడాకులు ఇవ్వ‌లేద‌ని చెప్పారు. విడాకుల త‌ర‌వాత త‌న‌కు పెళ్లి చేసుకోవాల‌ని అనుపించిందని చెప్పారు. ఆ విష‌యాన్ని త‌న పెద్ద‌ కూతురుకు చెబితే తాను కూడా చాలా సంతోషించింద‌ని అన్నారు. త‌న త‌ల్లి ఇప్ప‌టికి మొద‌టి భార్య‌తో పిల్ల‌ల‌తో మాట్లాడుతుంద‌ని అన్నారు. త‌న‌తో పాటూ త‌న రెండో భార్య పోని వ‌ర్మ కూడా మొద‌టి భార్య‌తో మాట్లాడుంద‌ని షాకింగ్ విష‌యాలు చెప్పాడు.

అప్పుడ‌ప్పుడు త‌న రెండో భార్య పిల్ల‌ల‌తో క‌లిసి మొద‌టి భార్య ఇంటికి వెళ‌తామ‌ని చెప్పాడు. ల‌త‌, పోని వ‌ర్మ‌లు మాట్లాడుకుంటార‌ని తెలిపాడు. అంతే కాకుండా త‌న మొద‌టి భార్య ఇప్పుడు త‌న‌కు ఫ్రెండ్ లాంటిద‌ని చెప్పాడు. ఆమెతో అప్పుడ‌ప్పుడూ మాట్లాడ‌తాన‌ని తెలిపాడు. ఇక ల‌లిత కుమారి ఎవ‌రో కాదు దివంగ‌త రియ‌ల్‌స్టార్ శ్రీహ‌రి భార్య డిస్కోశాంతికి స్వ‌యానా సోద‌రి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news