Moviesఅలా మాట్లాడటానికి ఆమె ఎవరు..? అందుకే నేనే సినిమాలో నుంచి తీసేశా..!!

అలా మాట్లాడటానికి ఆమె ఎవరు..? అందుకే నేనే సినిమాలో నుంచి తీసేశా..!!

సినీ ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ..అలాంటి వారిలో ఒక్కరే ప్రోడ్యూసర్ అశ్వీని దత్. మంచి మంచి సినిమాలు నిర్మించడంలో ఈయనకు లేరు సాటి. జనరల్ గా ప్రోడ్యూసర్స్ అంటే..కోపిష్టి..డబ్బులు ఇవ్వడు..నశ పెడుతుంటారు అని అనుకుంటుంటారు కొందరు జనాలు. అఫ్ కోర్స్ అలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ, వాళ్ళకి ఫుల్ వ్యతిరేకం అశ్వీని దత్. సినిమా ఓకే అయ్యే ముందే ఓ క్లీయర్ బడ్జేట్ ని వేసుకుంటాడు. దానికి తగ్గట్లు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తాడు.

 

సినిమా స్టోరీని విని ఎన్ని రోజులు ఆడుతుందో చెప్పే సత్తా ఉన్న మనిషి. సినిమా బడ్జేట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటాడొ..క్యారెక్టర్ విషయంలోను అంతే స్ట్రిక్ట్ గా ఉంటాడు. రీసెంట్ గా ఆలీ తో సరదాగా షోకి గెస్ట్ గా వచ్చిన ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాల గురించి వారి బీహేవియర్స్ గురించి..తన పరసనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు. ఈ షో ప్రత్యేకం గా చిరంజీవితో ఆయనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే మహానటి సినిమా టైంలో జరిగిన గొడవ గురించి కూడా రివీల్ చేసారు. నిజానికి మహా నటి సినిమాకు మొదట అనుకున్నది కీర్తి సురేష్ ని కాదట. ఆమె స్ధానంలో ఓ మలయాళీ ముద్దుగుమ్మను అనుకున్నారట. ఆమె కూడా ఓకే చెప్పిందట కానీ, సినిమాలో మందు సీన్స్ ఉంటే చేయను అని స్క్రిప్ట్ లో చేంజస్ చేయమని అడిగిందట. దీంతో అశ్వీని దత్ కు కోపం వచ్చి..ఆమె ను సినిమా లో నుండి తీసేసారట. “స్క్రిప్ట్ లో మార్పులు చేయమనడానికి ఆమె ఎవరు..అందుకే నేనే సినిమాలో నుండి తీసేశా..”అంటూ చెప్పుకొచ్చాడు అశ్వీని దత్. ఇక ఆ హీరోయిన్ ఎవరో మనకు బాగా తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news