ప్రస్తుతం టాలీవుడ్‌లో అంతా దందా నడుస్తుంది. ఇక్కడ రాజ్యం అంత పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలదే. ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలు, చిన్న హీరోల సినిమాలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న చర్చలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులో టాలీవుడ్‌లో చిన్న నిర్మాతలు బతికి బట్టకట్టే పరిస్థితి లేదని వారు ఏడుపులు, పెడబొబ్బొలు పెడుతున్నారు. ఒక చిన్న నిర్మాత సినిమా తీశాడు అంటే ధైర్యంగా రిలీజ్ చేసుకోలేని పరిస్థితి ఈరోజు టాలీవుడ్‌లో నెలకొంది. తాజాగా యంగ్ హీరో నిఖిల్ చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ వర్గాల్లో దూమరం రేపుతున్నాయి. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా ఈ నెల 14 ప్రేక్షకుల ముందుకు రానుంది.
చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్ కూ జోడిగా అనూపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. 8 సంవత్సరాలు క్రితం నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ2 తెరకెక్కింది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ఫినిష్ అయినా కూడా ఏదో ఒక కారణంతో వాయిదా పడుతు వస్తుంది. చివరకు ఆగస్టు 12న సినిమా రిలీజ్ చేస్తున్నటు ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో నిఖిల్ తన అవేదన అంతా వ్యక్తపరుస్తు చాలా షాకింగ్ కామెంట్లు చేశాడు.
నిఖిల్ తన సినిమాను జూలైలోనే రిలీజ్ చేయలని చూశాడు. అయితే చాలా మంది పెద్ద నిర్మాతలు సినిమాను చాలా సార్లు వాయిదా వేయిస్తూ పోయారు అని నిఖిల్ వాపోయాడు. జూలై 22న కార్తికేయ2 రిలీజ్ అనుకుంటే ఆ రోజు నాగచైతన్య థ్యాంక్యూ కోసం దిల్‌రాజు ఒత్తిడి చేసి మరి కార్తికేయ2 రిలీజ్ డేట్‌ను మార్పించారు అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 5న రిలీజ్ అనుకున్నా కళ్యాణ్ రామ్ బింబిసార, వైజయంతీ మూవిస్ సీతారామం సినిమాలు ఉండడంతో థియేటర్లు దొరక్క పోవడంతో మరోసారి నిఖిల్ తన సినిమాను వాయిదా వేసుకున్నాడు.
చివరకు ఆగస్టు 12న కార్తికేయ2ను రిలీజ్ చేయలని అనుకున్నారు. అదే రోజు నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా రిలీజ్ అవుతోంది. దీంతో కొందరు పెద్దలు ఇప్పుడు కూడా మీ సినిమా ఇప్పుడు వద్దు థియేటర్లు దొరకవు.. అక్టోబర్ లేదా నవంబర్‌కు వెళ్లిపొమ్మని చెప్పారని నిఖిల్ వాపోయాడు. ఈ మాట తనను ఎంతో అవేదనకు గురి చేసిందని… ఈ సంఘటన జరిగాక వారం రోజులు తాను ఏడ్చానని నిఖిల్ తన మనస్సులో బాధను వెళ్లగక్కాడు.
అయితే మా సినిమా నిర్మాతలు పట్టు పట్టి ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నారని.. ఇండస్ట్రీలో తనకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేక పోవటంతోనే ఇలా చేస్తున్నారని నిఖిల్ వాపోయాడు. గత 15 రోజుల నుంచి సరిగ్గా నిద్ర పోకుండా నిఖిల్ బాధ పడుతున్నటు టాక్. ఏదేమైనా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు, వారసుల సినిమాలు, పెద్ద బ్యానర్ల సినిమాలకు ఒక న్యాయం… చిన్న నిర్మాతలు, చిన్న హీరోల సినిమాలకు మరో న్యాయం జరుగుతుంది అన్న విషయం మరోసారి నిఖిల్ విషయంలో స్పష్టమైంది.