నందమూరి నరసింహ బాలకృష్ణ అఖండ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అఖండ తర్వాత ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ భారీ బడ్జెట్ తో ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకు రెడ్డి గారు – జై బాలయ్య అన్న టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
అటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బాలయ్య… ఇటు హిందూపురం ఎమ్మెల్యేగా, రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. అటు బసవతారకం ఆసుపత్రి చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా బాలయ్య సినిమాల పరంగాను… రాజకీయాల పరంగాను, సామాజిక సేవలను క్షణం తేరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడు చాలా సింపుల్ గా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తాజాగా బాలయ్య ఒక సామాన్య కుటుంబంతో ఉన్న ఒక వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కోసం బాలయ్య – శృతిహాసన్ టర్కీ వెళ్లారు. మరికొన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్ అక్కడే జరగనుంది. ఈ క్రమంలోనే బాలయ్య టర్కీలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ కుటుంబంతో కలిసి టిఫిన్ చేయడంతో పాటు వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు.
ఇక మందులు వేసుకునే సమయం అయింది. అటు హిందూపురం ఎమ్మెల్యేగా.. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండటం చాలా ఆనందంగా ఉంది…. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చునే వాళ్ళకి పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తాయని బాలయ్య చెప్పారు. అనంతరం బాలయ్య పక్కనే ఉన్న మహిళను చూపించి వీళ్ళు కూడా ఇంట్లో కూర్చుని ధారావాహికలు చూస్తుంటారు.. మైండ్ పాడు చేసుకుంటూ ఉంటారు.
నా ఆలోచన ప్రకారం టీవీ తక్కువ చూస్తే కళ్ళకు మంచిది.. అసలు చూడకపోతే మెదడుకు మంచిది.. అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. బాలయ్య చెప్పిన ఆ మాటలను ఆ కుటుంబం సరదాగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు బాలయ్యను మెచ్చుకుంటున్నారు. ఒక స్టార్ హీరోగా ఉండి… ఎలాంటి గర్వం లేకుండా సామాన్యులతో ఆయన ప్రవర్తించిన తీరుకు ఫిదా అవుతున్నారు.