విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇదే పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. ఇప్పటివరకు ఈ హీరో తీసిన సినిమాలు చాలా తక్కువ. అందులో హిట్ అయిన సినిమాలు మరీ తక్కువ . కానీ, తీసిన రెండు మూడు సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా తన కెరీర్ మలుపు తిప్పాయి. అంతేనా యువతలో సరికొత్త ఫార్ములాను క్రియేట్ చేసి జనాలుకు పిచ్చెక్కించేశాడు ఈ విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో తన తలరాతను తానే మార్చుకున్న ఈ విజయ్ దేవరకొండ ప్రజెంట్ లైగర్ సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు.
టాలీవుడ్ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా లైగర్. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకొని ఉన్నారు. AUGUST 25 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనులను విజయ్ దేవరకొండ దగ్గరుండి మరి చూసుకుంటున్నారు. తన యాటిట్యూడ్ తో.. తన స్టైల్ తో.. తన పొగరుతో.. తన మాటతీరుతో.. నిరంతరం నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాడు ఈ రౌడీ హీరో.
లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ అనుకోకుండా స్టార్ సన్స్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆయన. తన రియల్ లైఫ్ గురించి.. తన రీల్ లైఫ్ లో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..” నాకు పూర్తిగా నేను ఎవరో తెలియదు. కానీ నాకు మాత్రం ఒకటి కచ్చితంగా తెలుసు.
నాకు నచ్చిందే చేస్తాను. అనిపించిందే మాట్లాడుతాను. నచ్చినట్లు ఉంటా.. అదే నాకు ఇష్టం . అన్నింటికన్నా అదే ముఖ్యం. మన లైఫ్ మనకు నచ్చినట్లు లేకుండా మనకు నచ్చినట్లు బతకలేకపోతే.. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా వేస్ట్. లాభం ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా ప్రయోజనం ఉండదు”.. అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ దేవరకొండ కొందరు స్టార్ హీరో సన్స్ ని టార్గెట్ చేశాడు అంటూ కొందరు ఆయన ను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఆయన సూపర్ స్టార్ అనే పదం మాట్లాడడమే ఇప్పుడు నెట్టింట చర్చనీయాంసంగా మారింది.