సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయ లోకం. ఓ రంగుల ప్రపంచం . ఇక్కడ బయటకు కనిపించినంత సాఫీగా ఏ హీరో హీరోయిన్ జీవితాల్లో ఉండవు. అదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు సీనియర్ హీరో కార్తీక్ .ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు .తన అద్భుతమైన టాలెంట్ తో తన సహజ సిద్ధమైన నటనతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ గుర్తింపుని సంపాదించుకున్నారు. కార్తీక్ అంటే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ సీతాకోకచిలుక సినిమాలో హీరో అంటే మాత్రం కచ్చితంగా గుర్తుపట్టేస్తారు.
చూడడానికి చాలా అమాయకంగా సైలెంట్ గా ఉండే ఈయన రియల్ లైఫ్ లో చేసిన పనుల గురించి తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. సీతాకోకచిలుక లాంటి క్లాసిక్ హిట్ అందుకున్న కార్తీక్ ఆ తర్వాత అనుబంధం ,అన్వేషణ, పుణ్యస్త్రి, అభినందన, గోపాలరావు గారి అబ్బాయి, మగరాయుడు తో పాటు పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. అంతెందుకు కళ్యాణ్ రామ్ ఓం త్రిడి సినిమాలో కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. కానీ ఇతను లైఫ్ లో చేసిన తప్పులే ఇతనికి శాపంగా మారాయి.
హీరోగా తన కెరియర్ ని కూల్ గా ముందుకు తీసుకెళుతున్న టైం లోనే అనుకోకుండా.. ఇతను చెడు స్నేహాలు కు చేసి,, చెడు వ్యసనాలకు అలవాటు పడి తన జీవితాని నాశనం చేసుకున్నాడు.
అంతేకాదు, కార్తీక్ రియల్ లైఫ్ లో సొంత భార్య చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. తెలుగు తమిళ భాషల్లో కలిపి మొత్తంగా 125 కు పైగా చిత్రాల్లో నటించిన ఈ హీరో కార్తీక్ 1988లో సహనటి అయిన రాగిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీరిద్దరూ కలిసి సోలైకుయిల్ అనే సినిమాలో కలిసిన నటించారు. ఆ టైంలోని ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు . వీరిద్దరికీ గౌతమ్ కార్తీక్ , ఘైన్ కార్తీక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 1992లో కార్తీక్ రాగిణి సొంత సోదరి అయిన రథి రెండో వివాహం చేసుకున్నాడు .
ఈ పెళ్లి అప్పట్లో సంచలనంగా మారింది. ఆమెను రెండో పెళ్లి చేసుకున్నకే కార్తీక్ జీవితం మొత్తం తలకిందులైంది. తమిళ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అవార్డులతో పాటు నంది అవార్డును కూడా సొంతం చేసుకున్న కార్తీక్ రాగిణి సోదరి ని పెళ్లి చేసుకున్నాకే.. ఆయన జీవితం కష్టాల కొలువులో మునిగిపోయింది. 2000 సంవత్సరం నుంచి ఆయన కష్టాలు మొదలయ్యాయి. 2000 సంవత్సరం నుంచి చాలా కష్టాలు ఎదురుకున్న ఈ కార్తీక్ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. తనకున్న చెడు అలవాట్ల వల్లే తన కెరీర్ మొత్తం నాశనం అయిపోయిందని పలు ఇంటర్వ్యూలో స్వయాన కార్తికే చెప్పుకు రావడం గమనార్హం.