అతిగా ఆశపడ్డ ఆడది..అతిగా ఆవేశపడ్డ మగాడు గెలిచిన్నట్లు చరిత్రలో లేదు..ఈ డైలాగ్ నే గుర్తు చేస్తున్నారు జనాలకు విజయ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ చూసి. ఏదైన హద్దులో ఉంటే అది బాగుంటుంది..హద్దు దాటితే..దానినే ఓవర్ అంటారు.. రేపటి రోజు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. పాపం విజయ్ దేవరకొండ కి భవిష్యత్తులో అదే జరగబోతుందా ..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. ఆయన ఇప్పటి వరకు నటించిన సినిమాలు వేటికి చేయనంత ప్రమోషన్స్ చేస్తున్నారు లైగర్ సినిమాకి.
అదే ఎక్కడో తేడా కొడుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న లైగర్ కు ఓ పెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ, ప్రజల్లో ఆయన మీద ఉన్న పిచ్చి క్రేజ్ చూస్తేనే గత సినిమాల రిజల్ట్ కనిపిస్తుంది. ఎటువంటి అంచలాను లేకుండా రిలీజ్ అయిన సినిమాలు మాత్రం బాగా హిట్ అవుతాయి. డియర్ కామ్రేడ్ విషయంలో ను అదే జరిగింది. ఓ రేంజ్ లో ప్రమోట్ చేసిన సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద తుస్సు మనిపించింది. ఇప్పుడు లైగర్ కూడా అలాగే బోల్తా కొట్టే ఛాన్సులు లేకపోనూలేదు.
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో సినిమా మొత్తం అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీలా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా తెలుగు కన్నా కూడా ఈ సినిమాను బాలీవుడ్ లోనే ఎక్కువ గా ప్రమోట్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్ బేస్ ఓకే కానీ..పూరీ గత సినిమాల రిజల్డ్ తెలిసిందే. విజయ్ ఫ్యాన్ బేస్ ఎంత హంగామా చేసిన..పూరీ టైం బాగోలేకపోతే..సినిమా రిజల్ట్ తారుమారు అవుతుంది. తాజాగా ముంబైలోని SGC Mallల్ల్లో లైగర్ టీమ్ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యారు.
అక్కడ లైగర్ టీమ్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది. ప్రేక్షకులు లైగర్ టీమ్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చారు. అక్కడవారిలో కనిపించిన ఎగ్జైట్మెంట్, ఎనర్జీతో మాల్ మొత్తం ఊగిపోయింది. అది కూడా సినిమాకి ఒకరకంగా మైనసే..ఎందుక్మటే ఊహించని స్ధాయిలో సినిమా లేకుంటే..చప్పట్లు కొట్టిన జనాలే..పోస్టర్ల పై పిడకలు కొడతారు..అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో విజయ్ ని ఓవర్ హంగామా పేరుతో ఎక్కడ నాకించేస్తారో అని అభిమానులకు కొత్త భయం పట్టుకుంది. మరి చూడాలి సినిమా హిట్ అవుతుందో..ఫ్లాప్ అవుతుందో..?