సినిమా పరిశ్రమలో హీరోయిన్లపై వేధింపులు, కాస్టింగ్ కౌచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవి ఇప్పుడే కాదు… 1970వ దశకం నుంచే ఉన్నాయి. అయితే అప్పుడు హీరోయిన్లు ఇప్పటిలా గొంతెత్తి మాట్లాడే సీన్ లేదు. ఎక్కడ ఛాన్సులు రాకుండా తొక్కేస్తారో ? అన్న భయాలు ఉండేవి. తమ కెరీర్ కోసం కూడా ఎవరికి వాళ్లు రాజీపడుతూ ఉండేవారు. అయితే ఇప్పుడున్నది అంతా సోషల్ మీడియా యుగం.. చాలా మంది తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపులు, ఇతర వేధింపుల గురించి ఓపెన్ అయిపోతున్నారు.
ఇక సీనియర్ నటి ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఆమెకు తమిళనాడులో అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు. అది ఖుష్బూ రేంజ్. అయితే ఖుష్బూకు కెరీర్ స్టార్టింగ్‌లోనే సినిమాల షూటింగ్‌లో ఈ వేధింపులు తప్పలేదట. అది కూడా తెలుగు సినిమా విషయంలో.. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ సారి చెప్పింది. ఆమె వెంకటేష్ తొలి సినిమా కలియుగ పాండవులులో హీరోయిన్. కె. రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకుడు.
ఈ సినిమా షూటింగ్ టైంలో ఓ వ్యక్తి వెనక నుంచే వచ్చి ఆమె బ్యాక్‌ను తాకాడట. వెంటనే ఖుష్బూ అతడి చెంప చెళ్లు మనిపించేసిందట. అప్పుడు రామానాయుడు, సురేష్‌బాబు ఇద్దరూ అక్కడే ఉన్నారట. అయితే వారిద్దరు కూడా తనకే సపోర్ట్ చేసి అండగా నిలబడ్డారని ఖుష్బూ తెలిపింది. ఆ తర్వాత ఆమె తమిళ్‌పై బాగా ఫోకస్ చేశారు. అప్పటి తరం స్టార్ హీరోలు అందరితోనూ ఏకంగా 150కు పైగా సినిమాల్లో నటించింది.
ఖుష్బూ క్రేజ్ తమిళంకే పరిమితం కాలేదు. తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ సినిమాల్లోనూ నటించింది. తెలుగులోనూ ఆమె నాగార్జున, వెంకటేష్‌తో నటించింది. తర్వాత చిరంజీవితో స్టాలిన్ సినిమలో తెర పంచుకుంది. తమిళ సీనియర్ హీరో ప్రభుతో ప్రేమాయణం నడిపిన ఆమె ఆ తర్వాత దర్శకుడు సి. సుందర్‌ను ప్రేమ వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయ్యింది.