Moviesనాకు డ‌బ్బులొద్దు.... ప్లీజ్ అని నిర్మాత‌ల‌ను వేడుకుంటోన్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌...!

నాకు డ‌బ్బులొద్దు…. ప్లీజ్ అని నిర్మాత‌ల‌ను వేడుకుంటోన్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌…!

ఆయన టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్. ఎందరో స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. ఆయన సినిమా అంటే ఎంత పెద్ద బడ్జెట్ అయినా… ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చక చక కంప్లీట్ చేసేస్తారు అన్న పేరు ఉంది. ఆయన కథ రాయాలన్నా… సినిమా తీయాలన్నా అంతా రోజుల్లోనే అయిపోవాలి. టాలీవుడ్‌లోనే డేరింగ్ డైరెక్టర్ గా ఆయనకు మంచి పేరు ఉంది. త్వరలోనే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఓ భారీ పాన్ ఇండియా సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఆయన దారుణంగా కిందపడిపోయిన ప్రతిసారి.. ఒక్క సూపర్ హిట్ సినిమాతో అంతే వేగంగా పైకి వచ్చారు. అలాంటి డైరెక్టర్‌కు ఇప్పుడు సన్ స్ట్రోక్ గట్టిగా తగులుతోంది.

మామూలుగానే టాలీవుడ్లో వారసులను హీరోలుగా సక్సెస్ చేసేందుకు బడా బడా ఫ్యామిలీల వాళ్లే ముప్పుతిప్పలుపడి మూడు చెరువుల నీళ్లు తాగుతున్నారు. మంచు మోహన్ బాబుకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. ఇప్పటికీ తన ఇద్దరు కుమారులను హీరోలుగా నిలబెట్టలేకపోయారు. దగ్గుబాటి వంశం నుంచి వచ్చిన రానా మాత్రం హీరో పాత్రలు మాత్రమే కాకుండా… విలన్ పాత్రలతో పాటు కంటెంట్ బలంగా ఉన్న సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే రానాకు ఇప్పటికీ మరి అంత స్టార్ హోదా అయితే రాలేదు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ దర్శకుడు కుమారుడు కూడా ఒక్క హిట్ కోసం నాలుగైదు సంవత్సరాలుగా పడరాని పట్లు పడుతున్నాడు. తన కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు ఆ దర్శకుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆయ‌నే స్వ‌యంగా డైరెక్ష‌న్ చేసి సినిమా చేస్తే డిజాస్ట‌ర్‌. తాను క‌థ ఇచ్చి.. ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తూ సినిమాలు తీయించాడు. అవి కూడా సేమ్ ప్లాప్ రిజ‌ల్టే వ‌చ్చాయి. దీంతో ఇప్పుడు ఆ ద‌ర్శ‌కుడు త‌న కొడుకు భ‌విష్య‌త్తును త‌లుచుకుని తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నాడ‌ట‌.

దీంతో ఇప్పుడు ఆ ద‌ర్శ‌కుడు కొడుకు కోసం సినిమా చేద్దామా ? అంటే అస‌లే కోట్ల‌లో వ్య‌వ‌హారం. గ‌తంలో సినిమాలు చేసి దెబ్బ‌లు తిని ఆస్తులు అమ్ముకున్నాడు. దీంతో ఈ సారి త‌న కొడుకు కోసం తాను నిర్మాత‌గా మారేందుకు సాహ‌సం చేయ‌డం లేద‌ట‌. త‌న కొడుకుతో ఓ సినిమా తీసి పెట్ట‌మ‌ని త‌న‌కు తెలిసిన నిర్మాత‌ల‌ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడ‌ట‌.

అస‌లు రెమ్యున‌రేష‌న్ ఒక్క పైసా కూడా వ‌ద్దు. క‌థ‌, మాట‌లు ఇత‌ర‌త్రా సాయం కావాలంటే నేను చూసుకుంటాను.. దానికి కూడా రెమ్యున‌రేష‌న్ వ‌ద్దు. అయితే ఎంత రెమ్యున‌రేష‌న్ లేద‌న్నా కూడా కూడా సినిమా అంటే క‌నీసం రు. 10 – 12 కోట్లు అవుతుంది. ఎంత త‌క్కువ వేసుకున్నా రు. 8 కోట్ల‌కు త‌గ్గ‌దు. పైగా ఆ హీరోకు అస్స‌లు మార్కెట్ లేదు. దీంతో ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఎంత బ‌తిమిలాడుతున్నా కూడా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news