అన్నగారు సినీ రంగంలో అనేక మెరుపులు మెరిపించారు. అనేక విజయాలు అందుకున్నారు. అయితే.. ఎన్ని విజయాలు అందుకున్నా.. నటులకు ప్రత్యేక గుర్తింపులే చిరస్థాయిగా మిగిలిపోతాయి. ఇలాంటివాటిలో వారికి అవార్డులే కీలకం. అందుకే నటులుగా ఉన్నవారు.. ఎన్ని సినిమాల్లో చేశాం అనే దానికన్నా కూడా.. ఎన్ని అవార్డులు వచ్చాయి. ఎంత మంది ఈలలు వేశారు.. గోల చేశారు.. అని లెక్కలు వేసుకుంటారట. ఈ క్రమంలోనే అన్నగారిలోనూ.. ఇదే తరహా కాంక్ష ఉంది. ఆయన కూడా అవార్డులంటే ఇష్టపడేవారు. అన్నగారికి ఒక్క అవార్డులే కాదు.. అంతకు మించిన అభినందనలు కూడా వచ్చాయి.
భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి వ్యవహరించిన కాలం 1977 నుంచి 1982 వరకు. అయితే.. ఆయన తెలుగు వారు. ఏపీలో అనేక పదవులు అనుభవించారు. కాంగ్రెస్‌లో అత్యంత నీతి మంతమైన రాజకీయాలు చేసిన వ్యక్తిగా.. . నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు .. ఎన్టీఆర్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. అన్నగారు కాంగ్రెస్ పార్టీలో అభిమానించిన నాయకుడు కూడా నీలం సంజీవరెడ్డి. అలాంటి నీలం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఏపీకి వచ్చిన ప్పుడు.. అన్నగారి సినిమాల గురించి వాకబు చేసేవారు.
నిజానికి ఆయన ఢిల్లీలో రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ.. అన్నగారి సినిమాల గురించి.. ఏపీ బాగోగుల గురించి.. ఆలోచించే వారు. ఏపీ సమస్యలపైనా ఆయన స్పందించేవారు. ఈ క్రమంలో ఆయన అన్నగారి సినిమాలపై మక్కువ ఏర్పరుచుకున్నారు. ఆయన రాష్ట్రపతి హోదాలో ఏపీలో పర్యటించిన సమయంలో అన్నగారి సినిమాల గురించి తెలుసుకునేవారు. ఇలా తెలుసుకుని.. ఆయా సినిమాలను వీక్షించేవారు. ఇలా వీక్షించిన సినిమాల్లో ఆయన బాగా మెచ్చుకున్న సినిమా.. సర్దార్ పాపారాయుడు.
నీలం పదవి నుంచి దిగిపోయే ముందు.. నాటికి విడుదలైన సినిమాను రామకృష్ణా.. సినీ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. దీనిపై ఆయన ఒక నోట్ కూడా రాసి వెళ్లారు. ఇప్పటికీ.. ఈ పుస్తకం.. రామకృష్ణా సినీ స్టూడియోలో ఉండడం గమనార్హం. ఈ సినిమాలో దేశ భక్తిని అపారంగా చూపించారని.. బ్రిటీష్ వారి పట్ల ఎన్టీఆర్ నటన అద్భుత మని ఆయన కొనియాడారు. ఇది ఎన్టీఆర్ జీవితంగా ఒక రాష్ట్రపతి ఇచ్చిన గొప్ప అభినందనగా చెప్పుకొనేవారు.