దివంగత మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నలుగురు కుమార్తెలలో చిన్నవారు అయిన ఉమామహేశ్వరి 52 ఏళ్ళకే ఆత్మహత్య చేసుకోవడం నందమూరి అభిమానులను తీవ్ర విషాదానికి గురిచేసింది. అయితే నందమూరి కుటుంబాన్ని గత కొన్ని సంవత్సరాలుగా వెంటాడుతున్న ఒక బ్యాడ్ సెంటిమెంటుకు ఉమామహేశ్వరి కూడా బలైపోయారు అన్న చర్చలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అసలు ఎన్టీఆర్ కుటుంబానికి ఆగస్టు నెల అంటేనే కలిసి రావటం లేదు. ప్రతిసారి ఆగస్టు నెల వస్తుందంటేనే ఎన్టీఆర్ కుటుంబంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది.
తాజాగా ఉమామహేశ్వరి ఆగస్టు ఒకటన ఆత్మహత్య చేసుకున్నారు ఇక ఎన్టీఆర్ నాలుగో కుమారుడు నందమూరి హరికృష్ణ నెల్లూరు జిల్లాలో ఒక పెళ్లికి వెళుతూ 2019 ఆగస్టు 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక టిడిపికి కూడా ఆగస్టు నెల అంతగా కలిసి రాలేదు. 1984లో ఆగస్టులో ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు. అప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ పై తిరుగుబాటు ఎగరవేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
దీంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవటం అప్పటి జాతీయ రాజకీయాల్లో సైతం సంచలనంగా మారింది. ఆ తర్వాత 1995 ఆగస్టులో చంద్రబాబు రూపంలో మరోసారి టిడిపిలో సంక్షోభం తలెత్తింది. అప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగా… చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇక తాజాగా ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కూడా ఆగస్టులోనే ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో ఈనెల అస్సలు నందమూరి కుటుంబానికి కలిసి రావడం లేదని చర్చలు మరోసారి తన మీదకు వచ్చాయి.