టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇష్టం లేని వాళ్లు ఎవ్వరు ఉంటారు చెప్పండి. ఆ అందం..ఆ నటన..ఆ మర్యాద..ఆ ప్రేమ..ఒకటి కాదు రెండు కాదు..హీ ఈజ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అని అనాల్సిందే. టాలీవుడ్ యువరాజు ఈ హీరో మహేశ్ బాబు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఆయన బర్త డే సంధర్భంగా..అభిమానులు కేక్ కట్ చేసి..మహేశ్ బాబుకు శుభాకాంక్షలు చెప్పుతున్నారు. పేద ప్రజలకు ఫుడ్ ప్యాకెట్స్..పంచుతూ..తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయనకు సంబంధిచిన ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి టైం లోనే ఆయన జీవితంలో ఇంపార్టెంట్ అయిన ఇద్దరు వ్యక్తుల గురించి గతం లో ఓ ఇంటర్వ్యులో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే మహేశ్ బాబుకు వాళ్ళ అమ్మ గారు ఇందిరా దేవి అంటే చాలా చాలా ఇష్టం. అలాగే మహేశ్ కు తన భార్య నమ్రత అంటే కూడా చాలా ఇష్టం. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట చాలా మంది భార్య భర్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
వంశీ సినిమా షూటింగ్ టైంలో కలిసి నటించే టైంలో నే ప్రేమలో పడ్డ ఈ జంట చాలా కాలం సైలెంట్ గా లవ్ చేసుకుని..వన్ ఫైన్ డే ఇంట్లో వాళ్లకి మ్యాటర్ చెప్పారు. ఇద్దరి ఇళ్లల్లో పెళ్ళికి ఒప్పుకోలేదు. కానీ, వాళ్ల స్టైల్ లో ఒప్పించి సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంట కి ఇద్దరు పిల్లలు. హ్యాపీగా సొసైటీలో మంచి పొజీషన్ లో బ్రతుకుతున్నారు. తాను ఎంత ఎత్తుకు ఎదిగిన ఇప్పటికి మహేశ్ కి వాళ్ళ అమ్మ చేతిలో అన్నం తినడం అంటే చాలా ఇష్టమట.