టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఇప్పటి వరకు 153 సినిమాలను చేశారు. వాటిలో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, ప్లాపులు కూడా ఉన్నాయి. కొన్ని ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. అయితే చిరు నటించాల్సిన కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని సినిమాలు రకరకాల కారణాలతో ఆయనే వదులుకున్నారు. అయితే చిరు రిజెక్ట్ చేసిన 8 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమాలు హిట్ అయ్యాక అర్రే మంచి హిట్ సినిమాలు మిస్ అయ్యానని చిరు ఫీల్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా చిరు వదులుకున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1- మన్నెంలో మొనగాడు :
కోడి రామకృష్ణ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా చేసిన సినిమా మన్నెంలో మొనగాడు. ఈ సినిమాను ముందుగా కోడి చిరంజీవితో చేయాలని అనుకున్నారు. అయితే అప్పటికే చిరంజీవికి మెగా మాస్ ఇమేజ్ రావడంతో అప్పుడప్పుడే తెలుగు, తమిళంలో కరాటేతో పాపులర్ అయిన అర్జున్‌తో చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ముందు కథ విన్న చిరు రిజెక్ట్ చేయడంతోనే అర్జున్ వద్దకు వెళ్లింది.
2- అఖరు పోరాటం:
మెగాస్టార్ చిరంజీవి – శ్రీదేవి క్రేజీ కాంబినేషన్ గురించి తెలిసిందే. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కన్నా ముందే వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనుకున్నారు. యండమూరి రాసిన ఆఖరు పోరాటం కథను చిరు – శ్రీదేవి కాంబోలో అనుకున్నారు. చిరు అప్పుడు బిజీగా ఉండి ఈ సినిమా వదులుకోవడంతో నాగార్జున చేసి హిట్ కొట్టారు.
3- అసెంబ్లీ రౌడి :
తమిళంలో హిట్ అయిన ఈ సినిమాను చిరుతో తెలుగులో రీమేక్ చేద్దామని అనుకున్నారు. పరుచూరి బ్రదర్స్ కూడా చిరుతోనే చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అయితే పొలిటికల్ కథాంశం కావడంతో చిరు వెనక్కు తగ్గారు. వెంటనే మోహన్‌బాబు ఈ ప్రాజెక్టును తన సొంత బ్యానర్లో చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు.
4- నెంబర్ వన్ :
సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్‌ను చివర్లో టర్న్ చేసిన సినిమా నెంబర్ వన్. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చిరు హీరోగా అన్నయ్య టైటిల్‌తో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఆ టైప్ సినిమాలు అప్పటికే చేసి ఉన్నానన్న భావనతో ఈ సినిమా చిరు రిజెక్ట్ చేయగా… కృష్ణకు సెకండ్ ఇన్సింగ్‌లో అదిరిపోయే హిట్ వచ్చింది.
5- సాహసవీరుడు సాగర కన్య :
జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ రేంజ్ కథ, కథనాలతో చిరు – మాధురి దీక్షిత్ జంటగా ఈ సినిమా తెరకెక్కించాలని రాఘవేంద్రరావు అనుకున్నారు. అయితే అప్పటికే వరుస ప్లాపులతో ఉన్న చిరు ఈ ప్రయోగాత్మక కథతో రిస్క్ చేసేందుకు ఇష్టపడలేదు. వెంటనే వెంకటేష్ ఈ సినిమా చేసి హిట్ కొట్టేశాడు.
6- ఆంధ్రావాలా :
ఇడియట్ తర్వాత చిరంజీవి పూరిని పిలిచి అభినందించి ఓ సినిమా చేద్దామన్నారు. వెంటనే పూరి చిరును దృష్టిలో ఉంచుకుని ఆంధ్రావాలా కథ రాసుకున్నారు. అయితే కథ నచ్చక మెగాస్టార్ దీనిని రిజెక్ట్ చేశారు. వెంటనే పూరి ఇదే కథతో ఎన్టీఆర్ హీరోగా ఆంధ్రావాలా సినిమా తీయగా డిజాస్టర్ అయ్యింది.
7- చంద్రముఖి :
కన్నడలో ఆప్తమిత్రుడు చూశాక తెలుగులో ఇది చిరంజీవికి బాగా సూట్ అవుతుందని మనసంతా నువ్వే దర్శకుడు విఎన్. ఆదిత్య చిరును అడిగారు. అయితే చిరు ఈ సినిమా తర్వాత చేద్దామని చెప్పారు. వెంటనే రజనీకాంత్ ఈ సినిమాను కోలీవుడ్ చేసి హిట్ కొట్టగా పెద్ద హిట్ అయ్యింది. తర్వాత అదే సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు.
8- టైగర్ నాగేశ్వరరావు :
ప్రస్తుతం రవితేజ హీరోగా సెట్స్ పై ఉన్న భారీ పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ కథ కూడా ముందుగా విన్న చిరు రిజెక్ట్ చేయడంతో చివరకు రవితేజ దగ్గరకు వెళ్లింది.