Moviesచిరుకు ముఖ్య‌మంత్రి పీఠంపై ఆశ పుట్టేలా చేసిన సినిమా... అప్ప‌ట్లో తెలుగు...

చిరుకు ముఖ్య‌మంత్రి పీఠంపై ఆశ పుట్టేలా చేసిన సినిమా… అప్ప‌ట్లో తెలుగు గ‌డ్డ షేక్‌..!

మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు సినిమాతో సౌత్ ఇండియాలోనే తిరిగి లేని సూపర్ స్టార్ అయ్యారు. ఆ సినిమాకు చిరు 1. 25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారు. అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో అదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ గా రికార్డులకు ఎక్కింది. దేవీఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై కే. దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఘరానా మొగుడు సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారన్న పుకార్లు వచ్చాయి. చిరంజీవి అభిమానులు కూడా చిరు పార్టీ పెడితే ఎన్టీఆర్ స్టైల్లోనే ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రచారం కూడా ప్రారంభించారు.

కరెక్ట్ గా అదే సమయంలో చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ముఠామేస్త్రి సినిమా వచ్చింది. కమర్షియల్ అంశాలు మిక్స్ చేస్తూ మెగా అభిమానులను అలరిస్తూ చిరంజీవిని ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేసిన తీరుకు ఆయన అభిమానులు ఫిదా అయిపోయారు. చిరంజీవి మాస్ ఇమేజ్‌ను మరో స్థాయిలో నిలబెట్టిన సినిమా ముఠామేస్త్రి. ముఠామేస్త్రిగా ఊర మాస్ పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు. కామెడీ టైమింగ్ – ఫైట్లు – డ్యాన్స్ ఒక రేంజ్ లో వర్కౌట్ అయ్యాయి.

ముందుగా ఓ కూరగాయల మార్కెట్లో రాజకీయాలు.. సమస్యలను పరిష్కరిస్తూ చివరకు రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ సినిమా అప్పట్లో పొలిటికల్‌గా కూడా కాకరేపింది. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే అన్న ఊహాగానాలు అప్పట్లో బలపడడంతో పాటు చిరంజీవికి కూడా రాజకీయాల్లోకి వస్తే ఎలా ? ఉంటుందన్న ఆలోచన రావడానికి కూడా ఈ సినిమాయే మూల స్తంభంగా నిలిచిందని అంటారు. ఇక ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల కాంబినేషన్ అయిన‌ కోదండరామిరెడ్డి – చిరంజీవి కాంబినేషన్లో ఇదే చివరి సినిమాగా నిలిచింది.

దొంగనాడొడుకు – సీఎంతో మీనాను ఉద్దేశించి నా జింగులకిడి అనడం – నేను మంత్రిని కదా.. స్టెప్పేస్తే బాగోదు – బోసూ.. అని విలన్ అంటే.. నోసు పగిలిపోద్ది.. బామ్మర్దిని పిలిచినట్టు ఏంటా చనువు ఈ డైలాగులు అప్ప‌ట్లో తెగ ఊపేశాయి. కామాక్షి దేవి కమల్ కంప్లైంట్స్ బ్యానర్ పై కేసీ శేఖర్ బాబు – డి శివ ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజ్ కోటి అందించిన సంగీతం చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ పేటకు నేనే మేస్త్రి అన్న టైటిల్ సాంగ్ బాగా పాపులర్ అయింది.

 

1993 జనవరి 17న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడంతో పాటు 30 కేంద్రాల్లో శత దినోత్సవ జరుపుకుంది. చిరంజీవి నటనకు ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డు దక్కింది. అలాగే చిరుకు చెరుకు జోడిగా మీనా – రోజులకు ఇదే తొలి సినిమా కావ‌డం విశేషం. ఈ సినిమా వచ్చాక చిరంజీవి అభిమానులు మా బాస్ త్వరలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవుతున్నాడు అన్న ప్రచారం ఉధృతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news