టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా.. అబ్బో ఈ అమ్మడు పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమాతో హ్యాపీగా సినీ ఇండస్ట్రీలో తన ప్లేసులు కన్ఫామ్ చేసుకున్న తమన్నా.. ఆ తరువాత వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా అమ్మడు పర్ ఫామెన్స్.. అమ్మడు నాభి అందాలు.. అమ్మడు లేలేత పాలమీగడ లాంటి అందం చర్మం.. కుర్రాలను మర్చిపోనీకుండా చేసింది. తమన్నా అందాలు ఎంత ఆకట్టుకున్నాయంటే బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కన్నా తమన్న అందాలే హైలెట్ గా నిలిచాయి, అంత బాగా జనాలను ఆకట్టుకుంది తమన్నా.
సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు పైనే అవుతున్న తమన్నా ఇంకా హీరోయిన్ గా అవకాశాలు అంటుకుంటుంది అంటే ఏకైక కారణం ఆమె ఫిజిక్. ఆమె మెయిన్ టైన్ చేస్తున్న అందమే కారణం. ఇప్పటికీ కుర్ర బ్యూటి ల పక్కన నిల్చుంటే తమన్నా అందంగా ఉంటుంది. అంత పర్ఫెక్ట్ ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ. అయితే రీసెంట్ గా తమన్నా మరో నయనతార లాగా బిహేవ్ చేస్తుంది అంటూ సినీ జనాలు చెప్పుకుంటున్నారు . దానికి కారణం తమన్నా తాను నటించిన “గుర్తుందా శీతాకాలం” సినిమా ప్రమోషన్స్ కి హాజరు కాకపోవడం.
మనకు తెలిసిందే నయనతార కూడా తన సినిమా ప్రమోషన్స్ కి హాజరు కాదు. ఈ విషయాన్ని ముందే దర్శక నిర్మాతలతో డీల్ కుదుర్చుకుంటుంది. తాను హీరోయిన్ గా మాత్రమే నటిస్తానని సినిమా ప్రమోషన్స్ కి ఏమాత్రం రాను అని కరాఖండిగా చెప్పేస్తుంది. ఆ లిస్టులోకి చేరింది ఇప్పుడు తమన్న. నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నా F3 సినిమా నుంచి ప్రమోషన్స్ అంటేనే తమన్నా చిరాకు పడిపోతుంది. తాను హీరోయిన్ గా నటించిన సినిమాకి కూడా ప్రమోషన్స్ కి రాకపోతే ..తమన్న హీరోయిన్ గా నెట్టుకు రాలేదు. దీంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి చెత్త పనులు చేయొద్దు తమన్నా.. నీ కెరియర్ నాశనం చేసుకోవద్దు అంటూ సజీషన్స్ ఇస్తున్నారు.