యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు చిన్న వయసులోనే ఎంతో పరిణితి ఉంది. కేవలం 20 సంవత్సరాల వయసులోనే టాలీవుడ్లో తిరుగులేని స్టార్డామ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ చాలా విషయాల్లో వయసులో తనకన్నా పెద్దవారిని కూడా మెప్పించి ఒప్పించే గుణం సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఆ మాటకి ఇండస్ట్రీలో సీనియర్లు, పెద్దలు కూడా ఎంతో గౌరవం, విలువ ఇస్తూ ఉంటారు. టాలీవుడ్లో దశాబ్దాలుగా అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వినిదత్.
సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటితరం స్టార్ హీరోల వరకు అందరితోనూ సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టిన ఘనత వైజయంతి మూవీస్‌దే. ఇక వైజయంతి బ్యానర్లు ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 – శక్తి – కంత్రి సినిమాల్లో నటించారు. అశ్విని దత్ రెండో కుమార్తె స్వప్న ప్రేమ పెళ్లి విషయంలో ఎన్టీఆర్ చాలా కీలకంగా వ్యవహరించారు. అశ్వినీదత్‌కు వారసులు లేరు. ఆయనకు ముగ్గురు కుమార్తెలే. పెద్ద కుమార్తె ప్రియాంక దత్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రేమలో పడింది.
దత్‌కు కుమార్తె ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పుకున్నారు. అయితే రెండో కుమార్తె స్వప్న కూడా ప్రసాద్ వర్మతో ప్రేమలో పడింది. అయితే తన కుమార్తెలు ఇద్దరూ తాను కుదిర్చిన సంబంధం కాకుండా ఇలా ప్రేమలో పడుతుండటం అశ్వినీదత్‌కు నచ్చలేదు. అలా అయిదారు నెలలపాటు ఇంట్లో చిన్నపాటి యుద్ధాలు జరిగేవట. స్వప్న మాత్రం తాను ప్రసాద్ వర్మనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చుంది. అలా ఇంట్లో తానేమి భోజనాలు మానేసి నిరాహార దీక్షలు అవి చేయలేదని.. పంతంతోనే ఉన్నానని చెప్పింది. అటు అశ్వినీదత్‌కు ఆయన భార్యకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు.
అప్పుడు ఎన్టీఆర్ రంగంలోకి దిగి అశ్వినీదత్ ఇంటికి వెళ్లి మరి ఆయనను ఈ ప్రేమ పెళ్లికి ఒప్పించారు. ప్రసాద్ వర్మ తనకు తెలిసిన వ్యక్తి అని.. మంచి వాడు అని అశ్వనీదత్ మానసు మారే వరకు కదల్లేదట. అలా స్వప్న పెళ్లి విషయంలో ఎన్టీఆర్ కీలకంగా మారారు. ఈ విషయాన్ని స్వప్న ఎన్నోసార్లు ఓపెన్ గానే చెప్పింది. ఇక ఇప్పుడు ప్రియాంక – స్వప్న ఇద్దరు కూడా తండ్రి ఘనమైన వారసత్వాన్ని నిలబెడుతూ వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్ లో తిరుగులేని మహిళ నిర్మాతలుగా తమదైన ముద్ర వేసుకున్నారు.