చందమామ కాజల్ అగర్వాల్ మళ్ళీ రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. అయితే, పెళ్ళైపోయిన.. ఫేడవుట్ అయిన హీరోయిన్స్‌ను అంత త్వరగా ఇండస్ట్రీలో వారు ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడరు. చాలా టాలెంటెడ్ హీరోయిన్, అందరితో కలుపుగోలుగా ఉంటుందీ..గ్లామర్ కాస్తంత కూడా తగ్గకుండా ఫిజిక్ మేయింటైన్ చేస్తుందీ… ఇంకా తను సినిమా చేస్తే పెద్ద ప్లస్ అవుతుంది..బిజినెస్ అవుతుందీ అనుకున్న వారు అయితే కాదనకుండా అవకాశాలిస్తారు.
చెప్పాలంటే అప్పట్లో పెళ్ళైన తర్వాత కూడా నటించిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ, ఈ జనరేషన్లో చాలా తక్కువ. పైగా ఎందుకో పెళ్ళైన హీరోయిన్ అంటే ఇప్పటి ప్రేక్షకులు కూడా పెద్ద ఆసక్తి చూపించడం లేదు. ప్రియమణి లాంటి వారు మళ్ళీ రీ ఎంట్రీతో హీరోయిన్గా రాణించాలనుకుంటున్నా అందుకు మేకర్స్, హీరోలు సహకరించడం లేదనే అర్థమవుతోంది. జాతీయ అవార్డ్ అదుకున్న ప్రియమణి నారప్ప సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా మళ్ళీ అడ్రస్ లేదు.
ఇప్పుడు కాజల్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందా అని అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం కాజల్ కి పెళ్ళితో పాటు ఓ బిడ్డ కూడా జన్మించడమే. పెళ్ళి వరకూ ఒకే గానీ, తల్లైన తర్వాత కూడా కాజల్‌ను హీరోయిన్గా అంగీకరిస్తారా..? అంటే ఇప్పుడు సరైన సమాధానం దొరకడం లేదు. అయితే కాజల్ ఫిజిక్ పరంగా గనక జాగ్రత్తలు తీసుకుంటే సీనియర్ హీరోలు అవకాశాలివ్వడం జరగొచ్చుననే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఎందుకంటే సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే, కాజల్ ఇండియన్ 2 సినిమా చేస్తుంది.
స్వయంగా తనే ఈ విషయం వెల్లడించింది కాబట్టి..ఆమెను మోసేందుకు కొందరు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు, హీరోలు ఉన్నారని అర్థమవుతోంది. తెలుగులో కాకపోయినా తమిళంలో కమల్ హాసన్, అజిత్, విక్రం లాంటి హీరోలు కాజల్‌ను తమ సినిమాలకు సిఫార్సు చేసే అవకాశాలున్నాయంటున్నారు. కాజల్ కూడా రీ ఎంట్రీ గట్టిగానే ప్లాన్ చేసుకుంటోంది. ఒకవైపు వెబ్ సిరీస్, మరొకవైపు సినిమా స్క్రిప్టులను చదువుతోంది. త్వరలో కొత్త ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించనుంది. చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో.