విజయ్ దేవరకొండ..ఓ బంగారు కొండ అనుకుంటున్నారు జనాలు. ఈయన పేరు చెప్పితే పిచ్చెక్కిపోయే జనాలు.. తెర పై కనిపిస్తే ఊగిపోయే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మొన్నటికి మొన్న..మొన్న ఈ హీరో కోసం ఓ లేడీ అభిమాని..తన వీపు పై పచ్చబొట్టు వేయించుకుంది. అంతేనా.. కొందరు అమ్మాయిలు అయితే పబ్లిక్ గానే “ఐ లవ్ యూ విజయ్” అంటూ..గోల గోల చేస్తున్నారు.
ఇక ఈ లిస్ట్ లో హీరోయిన్స్ కూడా ఉన్నారండోయ్. బాలీవుడ్ బ్యూస్టీస్, టాలీవుడ్ ఫిగర్స్..పెళ్లైన ఆంటీలు..విడాకులు తీసుకున్న భార్యలు అందరికి విజయ్ పైనే క్రష్. లైగర్ సినిమా కోసం న్యూడ్ పోస్టర్ వదిలితే హీరోయిన్స్ హాట్ కామెంట్స్ చేసిన తీరు జనాలను ఆశ్చర్య పరిచింది. అంతాలా మిగతా మగాళ్లల్లో లేనిది..విజయ్ లో ఉన్నది ఏంటా అని కొందరు సినీ ప్రముఖులు సైతం ఆలోచించుకునేలా చేసింది.
అయితే, ఇలాంటి పిచ్చెక్కించే ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ఉన్న హీరో తో నటించను అని ముఖానే చెప్పేసింది ఓ హీరోయిన్. ఆమె లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. తనదైన స్టైల్ లో నటించి అలరించి మెప్పించిన ఈ బ్యూటీ..గతంలో ఆయనతో నటించే ఛాన్స్ వస్తే నో చెప్పి అందరికి షాకిచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమాలో మొదట హీరోయిన్ గా అనుకుంది సాయిపల్లవినేనట. కానీ, ఈ సినిమాలో ముద్దు సీన్ ఉందని ..నటించను అని నో చెప్పిందట. అంతే కాదు భవిష్యత్తులో కూడా విజయ్ తో నటించను అని ..ఆయన సినిమా చూసింగ్ కి , తన సినిమా చూసింగ్ కి చాలా తేడా ఉంటుందని చెప్పుకొచ్చింది.