యస్ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి తల్లి కాబోతున్నట్లు తెలుస్తుంది. అదేంటి మొన్న ఈ మధ్యనే కదా ఆమె ఓ బిడ్డకి తల్లిగా మారింది..అప్పుడే మళ్లీ తల్లినా అని అనుకుంటున్నారా..? ఎస్ ఆమె తల్లిగా మారిన మాట నిజమే. కానీ ఆమె కడుపులో బిడ్డకు జన్మనివ్వలేదు. సరోగసి ప్రాసెస్ ద్వారా ఆమె తల్లి అయ్యింది. ఇప్పుడు కూడా అంతే ఆమె రెండో బిడ్డకు కూడా అలాగే తల్లిగా మారబోతుందట. తన కడుపులో మోయడం లేదు అలాగని సరోగసి ద్వారా పిల్లల్ని కనడం లేదు.. ఓ అనాధ బిడ్డను దత్తత తీసుకొని రెండోసారి తల్లి గా మారనుందట ప్రియాంక. దీంతో దీనికి సంబంధించిన విషయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి
మనకు తెలిసిందే ఈ మధ్య సెలబ్రిటీలు చాలామంది ఈ సరోగసి ప్రాసెస్ ద్వారానే పిల్లల్ని కంటున్నారు. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు ఎక్కడ పిల్లని కంటే తమ అందాలు పాడైపోతాయో అని.. భయపడి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరికొందరు హీరోయిన్లు అయితే అలాంటివి ఏమీ పట్టించుకోకుండా మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మ అనే పిలుపుకు దగ్గరవుతున్నారు. కాగా ప్రియాంక చోప్రా రెండోసారి తల్లి అవుతుంది అంటూ నేషనల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
ప్రియాంక చోప్రా ఎంత పెద్ద హీరోయినో అంతకంటే మంచి మనసున్న మనిషి అంటూ చాలా సార్లు ప్రూవ్ చేసుకుంది. అనాధ పిల్లలకు సహాయం చేయడం .. యాక్సిడెంట్లో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని ఆర్ఫన్ ద్వారా తనకు చేతనైన సహాయం చేయడం వంటివి చేస్తుంటారు. ఈ మధ్యనే ఉక్రెయిన్ బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే. కాగా రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఓ అనాధ బిడ్డను దత్తత తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ బిడ్డకు తానే తల్లిగా ఉండబోతుందట . దీంతో రెండోసారి ప్రియాంక చోప్రా తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.