సినీ రంగంలో అన్నగారు చాలా స్ట్రిక్ట్. షెడ్యూల్ అంటే..షెడ్యూలే. టైం అంటే.. టైమే! ఫలానా సమయా నికి..షూటింగ్ స్టార్టవుతుందని.. డైరెక్టర్ ముందు రోజు చెప్పగానే.. అన్నగారు.. ఠపీమని.. ఆ సమయానికి రెడీ అయ్యేవారు. అంతేకాదు.. పాత్రను బట్టి.. షూటింగుకు.. మూడు నుంచి రెండు గంటల ముందుగానే సెట్స్‌కు వెళ్లి.. తన మేకప్ తనే వేసుకునేవారు. దీనివల్ల.. నిర్మాతకు అంతో ఇంతో మేకప్ మేన్ ల ఖర్చు తగ్గుతుందని చెప్పేవారు.
ఇలా.. ఒక్క షూటింగ్‌లోనే.. కాదు.. డబ్బు విషయంలోనూ.. అన్నగారు ఖచ్చితంగా ఉండేవారే. గతంలో అన్నగారు.. నెల వారీ జీతాలకు నటించిన విషయం తెలిసిందే. ఇలా.. అన్నగారు ఎన్టీఆర్, మహానటి సావిత్రి, సూర్యకాంతం, అక్కినేని.. జగ్గయ్య వంటి మహామహులు కూడా నెల జీతాలకు పనిచేసేవారు. ఈ క్రమంలో ఒక్కొక్కసారి స్టూడియో యజమానులు.. ముగ్గురు నలుగురు నటులకు కలిపి.. ఏకమొత్తంలో వేతనాలు ఇచ్చేసేవారు. `మీరంతా కలిసే ఉంటారుగా.. పంచుకోండి“ అని ఉచిత సలహా పడేసేవారు.
ఈ క్రమంలోనే `మిస్సమ్మ` సినిమాలో అక్కినేని, జమున, సావిత్రి, రేలంగి నటించారు. ఈ నలుగురు ఆ సినిమాకు అత్యంత హైలెట్. నెల నెలా వేతనానికే ఈ సినిమా కూడా చేశారు. అప్పట్లో రేలంగికి 55 రూపాయలు ఇస్తే.. అన్నగారికి 75 రూపాయలు, సావిత్రికి 70 రూపాయలు, జమునకు 45 రూపాయలు, అక్కినేనికి 30 రూపాయలు ఇచ్చారు. అయితే.. ఈ మొత్తాన్ని వాహినీ స్టూడియో అధినేత.. చెక్కు రూపంలో అన్నగారి చేతిలో పెట్టారు. మీరంతా కలిసి పంచుకోమని చెప్పారు.
తీరా.. చూస్తే.. జమున, అక్కినేని, రేలంగి.. ఒక గ్రూప్‌గా.. వారి మొత్తాన్ని తీసుకువెళ్లిపోయారు. సావిత్రి, ఎన్టీఆర్‌లు కలిపి పంచుకోవాలి. అయితే.. సావిత్రి 80 రూపాయలు తీసుకుని వెళ్లిపోయారు. మర్నాడు షూటింగ్‌లో ఇస్తానని చెప్పారట. కానీ, వాస్తవానికి మరో నెల రోజుల వరకు ఆమె వేరే షూటింగ్ కోసం.. పనిచేశారు. దీంతో ఎన్టీఆర్‌తో కలుసుకోవడం సాధ్యం కాలేదు. కానీ.. అన్నగారి దగ్గర డబ్బులు నిండుకున్నాయి.
చేతిలో ఉన్న డబ్బులో సింహ భాగం.. ఇంటికి పంపేయగా.. రూం రెంట్ వంటివి కట్టేయగా.. సిగరెట్ పెట్టెకు సాదాఖర్చులకు.. డబ్బులు లేకుండా పోయాయట. దీంతో ఏమైతే అది అవుతుందని.. సావిత్రి ఉంటున్న రూంకు వెళ్లి మరీ.. తన ఐదు రూపాయలు తెచ్చుకున్నారట. ఈ విషయంపై చాలా సార్లు.. జగ్గయ్య జోకులు పేల్చేవారు. అన్నగారి అంతటి వారికే.. 5 రూపాయల తిప్పలు తప్పలేదు.. అని ఆయన అంటుండేవారు.