ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన.. తర్వాత.. తెలుగు సినీ ఇండస్ట్రీని ఏపీకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఇవి..అప్పట్లోనే మొదలై.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుంజుకున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఏపీ ఇండస్ట్రీ ఏర్పడింది. అయితే.. అప్పట్లో అన్నగారు.. చాలా మంది సినిమా హీరోలను.. హీరోయిన్లను కూడా.. ఏపీకి రప్పించే ప్రయత్నాలు చేశారు. వీరిలో జమున, గుమ్మడి, అక్కినేని, మిక్కిలినేని.. రామానాయుడు.. ఇలా ఆ నాటి తరం వారు చాలా మంది ఉన్నారు.
అయితే.. అంజలీదేవి.. సావిత్రి.. భానుమతి.. వంటివారు మాత్రం ఏపీకి రాలేదు. ఎందుకంటే.. అప్పటికే వారికి చెన్నైలో స్టూడియోలు ఉన్నాయి. అదే సమయంలో వారి కుటుంబాలు కూడా.. అక్కడ స్థిరపడ్డాయి. దీంతో వారు ఏపీకి వచ్చేందుకు వెనుకాడారు. పైగా.. ఏపీలో ఇది డెవలప్ అయ్యేందుకు సమయం పడు తుందని కూడా వారు భావించారు. ఇక, హీరోయిన్ల మాట అలా ఉంటే.. ప్రముఖ హీరో.. శోభన్‌బాబు కూడా.. ఏపీకి వచ్చేందుకు వెనుకాడారు.
ఈ విషయంలో అన్నగారు ఎన్టీఆర్.. శోభన్‌బాబును చాలా వరకు ఒత్తిడి చేశారు. ఆయన వస్తానంటే.. స్టూడియో నిర్మించుకునేందుకు స్థలం ఇస్తానని కూడా చెప్పారు. అంతేకాదు.. అందరితో పాటే.. ఆయనకు కూడా.. స్థలం ఇస్తానని.. ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండిపోవచ్చని అన్నారు. అయినప్పటికీ.. శోభన్‌బాబు రాలేదు. మరి దీనికి ఉన్నకారణం ఏంటి ? అనేది అప్పట్లో ఆసక్తిగా మారింది. శోభన్‌బాబుకు చాలా దూరదృష్టి ఎక్కువ.
ఆయన ఒక రూపాయి పెట్టుబడి పెట్టాలన్నా.. కూడా అనేక రూపాల్లో ఆలోచించి.. పెడతారు. లేదా.. ఒక సినిమా చేయాలన్నా.. అంతే. నిర్మాత శక్తి సామర్థ్యాలను కూడా ఆయన అంచనా వేసుకుని సినిమాకు ఒప్పుకుంటున్నారు. ఇలానే.. ఆయన ఏపీకి తాను షిఫ్ట్ అయితే.. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆయన ప్రశ్న. ఎందుకంటే.. ఏపీ ప్రభుత్వం అప్పట్లో కేటాయించిన బంజారా హిల్స్.. జూబ్లీహిల్స్ స్థలాలు కొండ ప్రాంతాలు. కోట్లకు కోట్లు పెట్టుబడులు పెట్టి బాగు చేసుకోవాలి.
ఇంత చేసుకున్నా.. ఇప్పట్లో ఇండస్ట్రీ డెవలప్ కాదనేది శోభన్‌బాబు ఉద్దేశం. కనీసం.. 40 ఏళ్ల తర్వాత.. కానీ.. ఇండస్ట్రీ డెవలప్ కాదని.. ఆయన అప్పట్లోనే చెప్పారు. అందుకే..ఆయన పెట్టుబడులు పెట్టేందుకు.. ఇష్టపడలేదు. పలితంగా ఆయన చెన్నైలోనే ఉండిపోయారు. చిత్రం ఏంటంటే.. శోభన్‌బాబు చెప్పినట్టు ఇప్పటికీ.. ఇండస్ట్రీ పూర్తిస్తాయిలో డెవలప్ కాకపోవడంగమనార్హం.