ఉదయ్ కిరణ్.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ఈ పేరుకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీ లోకి “చిత్రం” అనే సినిమా ద్వారా హీరోగా ఎంటర్ అయిన ఈ ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఎవ్వరూ ఊహించినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తో స్టార్ హీరోలకి కూడా దడ పుట్టించే స్థాయి అందుకున్నాడు. హీరో ఉదయ్ కిరణ్ అంటే ఆ రోజుల్లో అమ్మాయిలు పడి చచ్చిపోయేవారు. లవర్ బాయ్ గా ఇమేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ తన సహజ సిద్ధమైన నటనతో ఇండస్ట్రీని ఏలేసాడు అనే చెప్పాలి.
అయితే ఏ దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ ఎంత త్వరగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ అయ్యాడో.. సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడో.. అంతే త్వరగా పతనమైపోయాడు. ఉదయ్ కిరణ్ కెరియర్ ఫ్లాప్ అవ్వడానికి ఇండస్ట్రీలో ప పెద్దాయన కారణమని అంతా అంటుంటారు. నిజా నిజాలు ఏంటో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ అయితే ప్రజెంట్ మన మధ్యలో లేడు అనేది మాత్రం నిజం.
పెరుగుతున్న కాంపిటీషన్ కి అవకాశాలు అందుకోలేక వచ్చిన సినిమా అవకాశాలని కరెక్ట్ గా ఉపయోగించుకోలేక డిప్రెషన్ కు గురై ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు.
జనవరి 5వ తేదీ 2014 న తన ఇంట్లో సూసైడ్ చేసుకునిప్రాణాల్ని తీసుకున్నాడు. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఉదయ్ మరణాన్ని టార్గెట్ చేసుకొని కొందరు పెద్దమనుషులు ఇండస్ట్రీలో రాజకీయం చేశారు. అలా ఉదయ్ సూసైడ్ చేసుకోవడం పై అప్పట్లో ఓ పెద్ద మనిషి “చచ్చిపోతే మిగిలేది బూడిదే” అంటూ చెప్పుకురావడం సంచలనంగా మారింది. కాగా ఉదయ్ కిరణ్ తో అవునన్నా కాదన్నా అనే సినిమా చేసిన హీరోయిన్ సదా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన మరణం పై సంచలన కామెంట్స్ చేసింది. “జీవితం మనకు నచ్చినట్లు సాగకపోతే డిప్రెషన్ కి లోనైపోతున్నారు. డిప్రెషన్ లో సూసైడ్ చేసుకుంటే మనం అనుకున్నది సాధిస్తామా..? మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ కామన్. ఆ ప్రాబ్లంస్ ను ఎదిరించి.. ఎదుర్కొని ..తట్టుకొని నిలబడాలి. అంతేకానీ ఇలా సూసైడ్ చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా” అంటూ.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి కామెంట్స్ చేసింది.
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి ఆమె మాట్లాడుతూ..” నేను ఎప్పుడు ఉదయ్ అంత పిరికివాడని అనుకోలేదు. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఉదయ్ కిరణ్ చాలా టాలెంటెడ్ గల హీరో. డిప్రెషన్ లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల సినీ ఇండస్ట్రీ ఓ మంచి నటుడిని కోల్పోయింది. మన జీవితంలో అన్నీ మన ప్లాన్ ప్రకారం జరగకపోతే వాటిని తట్టుకొని ముందుకు సాగడమే మనిషి లక్షణం. మన లైఫ్ ప్లాన్ చేసుకున్న విధంగా జరగకపోతే డిప్రెషన్ కు లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ చాలా గొప్పది..మీకు నచ్చిన్నత్లు బ్రతకండి..” అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చింది సదా. ప్రస్తుతం సదా తన సెకండ్ ఇన్నింగ్స్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.