సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. సినిమా అవకాశాల కోసం వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వాలని లైఫ్ ఇవ్వాలని అనుకునేవాళ్లతో పాటూ వాడుకోవాలని చూసేవాళ్లు కూడా చాలా మంది ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. సినిమాలలో ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్మెంట్ అడిగారని ఒకప్పటి హీరోయిన్ల నుంచి ఇప్పటి హీరోయిన్ల వరకూ చాలా మంది మీడియా ముఖంగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామలే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కొంటున్నారు.
హీరోయిన్లు ఒకసారి సక్సెస్ అయితే ఆ తరవాత కమిట్‌మెంట్ అడిగేందుకు ఎవ్వరు ధైర్యం చేయరని చెబుతుంటారు. ఇక పద్దతిగా కనిపించే హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం కామన్. కానీ వర్మ బ్యూటీ అప్సరా రాణి కూడా తానూ కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నిజానికి అప్సరాణి అసలు పేరు అంకిత మహారాణా కాగా ఆర్జీవీ అప్సరరాణిగా నామకరణం చేశాడు. నిజానికి అప్సర రాణి 4 లెటర్స్ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.
ఆ తరవాత ఊలాల ఊలాల సినిమాలో నటించింది. రెండో సినిమాలో గ్లామర్ షో పెంచేసింది. ఇక ఆ తరవాత ఈ అమ్మడి పై ఆర్జీవీ కన్ను పడింది. దాంతో ఆర్జీవీ థ్రిల్లర్ అనే సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమా సమయంలోనే అప్సరరాణిగా పేరు మార్చి మరోసారి పరిచయం చేశాడు. తన సోషల్ మీడియాలో అప్సరతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో అప్సరకు తక్కువ కాలంలోనే క్రేజ్ పెరిగిపోయింది. ఆ తరవాత ఆర్జీవీ దర్శకత్వంలోనే వరుస సినిమాలు చేసింది.
అంతే కాకుండా స్టార్ హీరోల సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసే అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉండగా తనకు కూడా సినిమా ఇండస్ట్రీలో చేదు అనుభవాలు ఉన్నాయని అప్సర ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కన్నడ ఇండస్ట్రీలో ఓ సినిమాలో తనను హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలిపింది. ఆ దర్శకుడు ఆఫీసుకు పిలవడంతో వెళ్లానని చెప్పింది. కానీ డైరెక్టర్ గదిలోకి తీసుకువెళ్లి తన కోరిక తీరిస్తే అవకాశం ఇస్తానని అన్నాడని చెప్పింది. తనతో పాటూ ఆఫీసుకు తండ్రిని కూడా తీసుకువెళ్లానని వెంటనే అక్కడ నుండి పారిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.