ఒకప్పుడు సౌత్‌లో ఊపు ఊపేసిన హీరోయిన్ నగ్మా. నగ్మా నడుము భాగానికి ఎక్కువగా ఫ్యాన్స్ ఉండేవారు. నగ్మా నడుముపై సాంగ్స్ కూడా వచ్చాయి. నగ్మాను ఆరేబియన్ గుర్రంతో పోల్చేవారు. ఆమె నడక స్టైల్ అలా ఉండేది. ఇలాంటి హీరోయిన్ రాఘవేంద్ర రావు లాంటి దర్శకుడికి దొరకాలే గానీ, వదులుతాడా..? పదహారేళ్ళ వయసు సినిమా నుంచి శ్రీదేవితో సినిమాలు చేసిన దర్శకేంద్రుడు ..ప్రతీ సినిమాలో ఆమెను ఎంత కొత్తగా చూపించాలో అంత కొత్త అంద అందంగా అంతకంతా గ్లామర్‌గా చూపించారు. దర్శకేంద్రుడు – శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలలోని సాంగ్స్ అన్నీ పెద్ద హిట్ అయ్యాయి.
మళ్ళీ అంత ఫోకస్ పెట్టింది నగ్మా మీదే అని చెపాలి. సుమన్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ సమయంలో నగ్మాను చూసిన రాఘవేంద్ర రావు ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశారు. అప్పటికే, నగ్మా హిందీలో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్గా కొనసాగుతోంది. అంతేకాదు, అలా చేసిన ఓ బాలీవుడ్ మూవీలో నగ్మా హీరోకి లిప్ లాక్ ఇచ్చింది. దాంతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాఘవేంద్ర రావు ఘరానా మొగుడు సినిమాను రూపొందించారు.
డేట్స్ ఖాళీ లేకపోయినా కూడా నగ్మానే కావాలని పట్టుపట్టి ఈ సినిమా కోసం ఆమెను ఫైనల్ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. షూటింగ్ కూడా అనుకున్నట్టుగా జరుగుతోంది. అయితే, ఉన్నట్టుండి ఒకరోజు షూటింగ్ సమయంలో నగ్మా ఓ సన్నివేశం చేయనని మొడికేసి కూర్చుంది. అప్పటికే, ఎన్నిసార్లు దర్శకుడు చెప్పినా ఆ సీన్ చేయనంటే చేయనని పట్టుపట్టింది. అదే చిరంజీవితో రొమాంటిక్ సీన్స్. ఈ సీన్లో ఆయన పెదవులకి నగ్మా తన పెదవులతో ముద్దు పెట్టాలి.
ఈ సన్నివేశం చేయడానికే ఆమె నో చెప్పింది. అటు చిరంజీవి కూడా లిప్‌కిస్ చేసేందుకు ఇబ్బందిగానే ఫీలవుతున్నాడు. చివరకు లిప్‌కిస్ సీన్ ముందు నగ్మా సెట్లోకి రావడం లేదు. ఇంతలో సెట్స్‌లోకి చిరంజీవి వచ్చారు. విషయం తెలుసుకొని కూల్ గా నగ్మాకి ఆ సీన్ కి ఇంపార్టెన్స్ చెప్పి వివరించారు. సీన్ చేద్దాం. మీకు నచ్చకపోతే ఎడిటింగ్‌లో దాన్ని తీసేద్దాం అని మాటిచ్చారు.
చిరంజీవి అంత భరోసా ఇవ్వగానే ఫైనల్‌గా చిరంజీవి చెప్పినట్టు లిప్ కిస్ పెట్టడానికి ఒకే అన్నది. దర్శకేంద్రుడు స్టైల్లో ఆ సీన్ చిత్రీకరించారు. సీన్ కూడా అద్భుతంగా వచ్చింది. దర్శకేంద్రుడు అనుకున్నది సాధించారు. కానీ, నగ్మా సీన్ చేసిన తర్వాత కూడా ఇబ్బందిగా ఫీలవుతున్న విషయాన్ని గమనించి దాన్ని ఫైనల్ ఎడిట్‌లో తీసేశారు. అప్పుడు ఘరానా మొగుడు సినిమా కోసం తీసిన సీన్ రష్ లో ఉంటుంది తప్ప సినిమాలో ఉండదు.