రెండేళ్లుగా ఊరిస్తూ వస్తోన్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఎట్టకేలకు ఈ నెల 25న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా గురించి కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు..పాన్ ఇండియా అంతటా ఆసక్తితో వెయిట్ చేస్తోంది. ఆగస్టులో టాలీవుడ్‌కు మంచి హిట్లు పడ్డాయి. ఇప్పటికే మూడు సూపర్ హిట్ సినిమాలు రాగా… లైగర్‌తో ఆ ఊపు కంటిన్యూ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు బాలీవుడ్లో వరుస ప్లాపులకు తోడు.. అక్కడ టాలీవుడ్ సినిమాల డామినేషన్ కార్తీకేయ సినిమాతో కంటిన్యూ అవుతోంది.
లైగర్‌కు బాలీవుడ్లో కరణ్ జోహార్ బ్యాకప్ ఉండడంతో పాటు ఆయన కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండడంతో బాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్‌కాగా ఎక్కడికక్కడ దుమ్ము రేపుతోంది. అసలు నార్త్‌లో కూడా ఫస్ట్ వీకెండ్ మూడు రోజులకు భారీగా అడ్వాన్స్ బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఇక లైగర్ సెన్సార్ కూడా పూర్తయ్యింది. చాలా షార్ట్ రన్ టైం ఫిక్స్ చేశారు.
చాలా క్రిస్పీగా సినిమాను కట్ చేశారనే అనుకోవాలి. లైగర్ రన్ టైం 2 గంటల 20 నిమిషాల సినిమా ఇది. సెన్సార్ వాళ్లు మొత్తం 7 కట్స్ చెప్పడంతో పాటు చేతితో సంజ్ఞలు చేసే ఓ సీన్‌కు కూడా అభ్యంతరం చెప్పారని అంటున్నారు. తొలి సగం.. 75 నిమిషాలు ఉంటే… రెండో సగం 65 నిమిషాలుగా ఉంది. ఇక సినిమాలో 7 ఫైట్లు, 6 పాటలు ఉన్నాయి. ముంబైలో వేసిన భారీ సెట్లలో యాక్షన్ సీన్లు హైలెట్‌గా నిలుస్తాయని అంటున్నారు. అలాగే భారీ సెట్లలో తీసిన పాటలు కూడా హైలెట్ అంటున్నారు.
ఇక సినిమా అంతా హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. బాక్సింగ్, హీరోయిన్‌తో లవ్, రెండు సాంగ్స్ ఫస్టాఫ్‌లో హైలెట్స్‌గా ఉంటాయట. ఇక సెకండాఫ్‌లో అమ్మ, ఫ్యామిలీ సెంటిమెంట్.. క్లైమాక్స్ హైలెట్స్ అంటున్నారు. అలాగే హీరోయిన్ అనన్య పాండే అందాలు కూడా హైలెట్ అంటున్నారు. సినిమాకు జస్ట్ ఓకే టాక్ వచ్చింది. పర్వాలేదనే అంటున్నారు. అయితే పోకిరిలా సైలెంట్‌గా ఎక్కేస్తే మాత్రం రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే అట. మరి లైగర్ భవిష్యత్తు ఏంటో ఈ నెల 25న తేలిపోనుంది.