ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట విజయ్ దేవరకొండ ఫ్లాప్ హీరో.. లైగర్ మూవీ వేస్ట్ సినిమా.. పూరి జగన్నాథ్ ఇక డైరెక్షన్ కి పనికిరారు ఈ మూడు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. దానికి కారణాలు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా ఎలాంటి చెత్త టాక్ ను సొంతం చేసుకుందో తెలిసిందే. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండె కలిసి జంటగా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయి ఫస్ట్ షోకే అట్టర్ ఫ్లాప్ టాక్ ను ను సొంతం చేసుకోవడంతో.. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్న అభిమానులకు భారీ రాడ్ దించేసిన్నట్లైంది.
కథలో పెద్దగా కంటెంట్ లేకపోవడం.. డైరెక్షన్ చాలా పూర్ గా ఉండడం.. పూరి జగన్నాథ్ రేంజ్ సినిమా కాకపోవడంతో అభిమానులు భారీ స్థాయిలో నిరాశ చెందారు. అంతేకాదు విజయ్ దేవరకొండ అంటేనే డైలాగ్స్ ఆయన చెప్పే డైలాగ్స్ కోసమే సినిమా థియేటర్స్ కి వెళ్తారు జనాలు. కానీ పూరీ ఆ విషయాన్ని మరిచిపోయి విజయ్ దేవరకొండకు సినిమాలో నత్తి పెట్టాడు. అంతే ఆయన ఏం చెప్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. దీంతో విజయ్ నటన పరంగా మెప్పించిన ..డైలాగ్స్ పరంగా ఆకట్టుకోలేకపోయాడు. ఇంత చిన్న లాజిక్ ని పూరీ గుర్తుపెట్టుకోకపోవడం ఇక్కడ గమనార్హం.
అయితే ఈ సినిమాలో మరో మిస్టేక్ కూడా ఉంది. సేమ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన రాధే శ్యామ్ సినిమా కోసం ఏదైతే తప్పు చేశాడో.. ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ అదే తప్పు చేశాడు అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . నిజానికి ఇప్పుడున్న మన టాలీవుడ్ హీరోలు టాలీవుడ్ కంటే ఎక్కువ బాలీవుడ్ పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు జనాలు ఏం కోరుకుంటున్నారో..అది మర్చిపోయే..బాలీవుడ్ హంగులు అద్దుతున్నారు. ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు ప్రభాస్ .
ఆయన రాధే శ్యామ్ సినిమాను తెలుగు రేంజ్ లో కాకుండా బాలీవుడ్ స్థాయిలో తీసి.. సినిమాకి లేనిపోని హంగామాలు చేస్తూ ఓవర్ ప్రమోషన్స్ చేసి అట్టర్ ఫ్లాప్ టాక్ ను దక్కించుకున్నాడు. సేమ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా లైజర్ సినిమాకి అదే తప్పు చేశాడు అంటు చెప్తున్నారు జనాలు. తెలుగు రేంజ్ ని ఊహించుకోకుండా ప్రతి ప్రమోషన్స్ లో బాలీవుడ్ కి పెద్దపీఠ్ వేస్తూ ఆయన చూపించిన యాటిట్యూడ్ మాట్లాడిన పొగరు మాటలు ఇప్పుడు ఆయన కెరీర్ ని నాశనం చేసే స్థాయికి వెళ్ళాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆఫ్ కోర్స్ మనం గమనించినంట్లైతే ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా.. విజయ్ దేవరకొండ లైగర్ మూవీ బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ రేంజ్ లోనే తెరకెక్కించారు . కానీ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. బాలీవుడ్ లో తెలుగు సినిమా పరువు తీసాయి.