Moviesఆ హీరోయిన్‌తో అంద‌రూ ముద్దులు మాత్ర‌మే కావాలంటున్నారా...!

ఆ హీరోయిన్‌తో అంద‌రూ ముద్దులు మాత్ర‌మే కావాలంటున్నారా…!

పాయల్ రాజ్‌పుత్.. ఈ పంజాబీ భామ సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా మారుతూ చేసిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ కి పరిచయమైంది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్నో కాంట్రవర్సీలు..టైటిల్ కోసం దర్శకుడు ఏకంగా విదేశాలకు కూడా వెళ్లాలనుకోవడం.. ఇలా చాలా సమస్యలనుంచి బయటపడి ఎట్టకేకలి ఆర్ఎక్స్ 100 సినిమా రిలీజైంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పిల్లా రా సాంగ్ బాగా హైప్ క్రియేట్ చేశాయి.

ఆ హైప్ కి తగ్గట్టే సినిమా కూడా యూత్ ఆడియన్స్‌తో పాటు అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మ్యూజికల్‌గా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇక కమర్షియల్‌గా కూడా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభం తెచ్చిపెట్టింది. దర్శకుడితో పాటు హీరో కార్తికే, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. అయితే, ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత హీరో, దర్శకుడికంటే ఎక్కువగా అవకాశాలు వచ్చింది పాయల్‌కే.

ఇప్పుడు హాట్ హాట్ పాత్ర‌లు, రొమాన్స్ చేయాలంటే టాలీవుడ్‌లో చాలా మందికి పాయ‌ల్ బెస్ట్ ఆప్ష‌న్‌గా క‌నిపిస్తోంది. అయితే వ‌రుస‌గా ఆ కథలను వినివినీ విసిగిపోయినట్టు అప్పట్లో పాయల్ చెప్పుకొచ్చింది. ఏ దర్శకనిర్మాత వచ్చినా పాయల్ వద్ద ముందు ముద్దుల ప్రస్తావనే తీసుకువచ్చారట. ఈ కథలో ఇన్ని ముద్దు సీన్స్ ఉంటాయి..ఇన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి..మీ రెమ్యునరేషన్ ఎంత ..అని అడిగేవారట.

అంతేకానీ, ఇదీ కథ..కమర్షియల్‌గా మంచి సక్సెస్ అవుతుంది. ఇలాంటి ప్రాజెక్ట్ కి మీరైతేనే కరెక్ట్ అని మాట్లాడిన వారు చాలా తక్కువ అని చెప్పుకొచ్చింది. దాదాపు 70 కథలు వింటే వాటిలో 99 శాతం నిర్మాతలు వంకరగా మాట్లాడిన వారే అని పాయల్ చెప్పిన సందర్భం కూడా ఉంది. కొందైతే అసలు కథ ఏంటో చెప్పకుండా ఘాటు రొమాటిక్ సీన్స్ ఉంటాయ‌నేవార‌ట‌.

అరడజనుకు పైగా ముద్దులుంటాయీ. మీకు ఓకేనా..అంటూ ఒకటే నస తప్ప మంచి కథలు వచ్చింది లేదు అని తెలిపింది. అందుకే, పాయల్ ఆర్ఎక్స్ 100 తర్వాత అంత త్వరగా మళ్ళీ కొత్త సినిమాతో రాలేదు. ఆలోచించి ఆలోచించి ఒప్పుకున్న ఆర్‌డీఎక్స్ లవ్ అనే సినిమా చేసినా అది ఆకట్టుకోలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news