ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి హఠాన్మరణం పాలయ్యారు. ఆమె సోమవారం మధ్యాహ్నం జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఆమె ఇంటికి చేరుకున్నారు. ఎన్టీఆర్‌కు మొత్తం 8 మంది కుమారులు, 4 గురు కుమార్తెలు.
వీరిలో ఉమా మహేశ్వరి నాలుగో అమ్మాయి ఉమా మహేశ్వరి కంటే మిగిలిన ముగ్గురు అమ్మాయిలు కూడా పెద్దవారు. దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మాజీ మంత్రి, ఆమె మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు భార్య. ఇక నారా భువనేశ్వరి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భార్య. ఇక మరో అమ్మాయి గారపాటి లోకేశ్వరి. ఆమె పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే గారపాటి సాంబశివరావుకు వదిన.
ఇక అందరికన్నా చిన్న అమ్మాయి ఉమా మహేశ్వరి. ఆమె జీవితంలో చిన్న విషాదకర సంఘటన కూడా ఉంది. ఆమెకు ముందు నరేంద్ర రాజన్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే అప్పటికే అతడికి మరో అమ్మాయితో ఎఫైర్ ఉండి.. ఉమా మహేశ్వరిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని అంటారు. దీంతో ఆమె నరేంద్రకు విడాకులు ఇచ్చేసి తర్వాత కృష్ణా జిల్లాకు చెందిన కంఠమనేని శ్రీనివాస ప్రసాద్‌ను పెళ్లాడారు.
నరేంద్ర రాజన్ ఎప్పుడు అయితే ఎన్టీఆర్‌కు అల్లుడు అయ్యాడో.. అతడిలో ఎక్కడా లేని గర్వం వచ్చేసింది. తాను ఏం చేసినా అడిగేవారు లేరన్న ధీమాతో ఉమా మహేశ్వరిని శారీరకంగా కూడా ఇబ్బందులు పెట్టేవాడని అంటారు. ఈ విషయం ఎన్టీఆర్‌కు తెలియడంతో ఓ సారి వార్నింగ్ ఇచ్చారు. తర్వాత కూడా అతడి బిహేవియర్ మారకపోవడంతో వెంటనే విడాకులు ఇచ్చేసి తన కుమార్తెకు మరో పెళ్లి చేశారు.