అనసూయ ఆంటీ ..అనసూయ ఆంటీ ..అనసూయ ఆంటీ ..ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. నిజానికి యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇది వరకు చాలా సార్లు అనసూయ పై నెగటివ్ ట్రోలింగ్ కూడా జరిగాయి. కానీ ఇన్నాళ్ల తన సినీ కెరియర్లో ఇప్పుడు జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్న విధంగా ఎప్పుడు చేయలేదు. దానికి కారణం అనసూయ పెట్టిన ఒకే ఒక్క ట్విట్. తెలిసి చేసిందో తెలియక చేసిందో… కానీ అనసూయ అనుకోకుండా లైగర్ సినిమాపై పరోక్షకంగా ట్వీట్ చేసి తన సమస్యను తానే కొని తెచ్చుకున్నట్లైంది.
గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో అనసూయ పై జరుగుతున్న ట్రోలింగ్ తెలిసిందే. విజయ దేవరకొండ లైగర్ మూవీ ఫ్లాప్ ను ఆమె సెలబ్రేట్ చేసుకోవడం.. పరోక్షంగా లైగర్ పై స్పందిస్తూ..” కర్మ కొన్ని సార్లు రావడం లేట్ కావచ్చేమో కానీ కచ్చితంగా వస్తుంది”.. అనడంతో విజయ్ దేవరకొండ అభిమానులకు మండిపోయింది. దీంతో మా విజయ్ ని అంటావా అంటూ అనసూయ పై ఫ్యాంద్ ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఆంటీ అంటూ కొందరు ..అమ్మమ్మ అంటూ కొందరు ..నువ్వు దానికే పనికొస్తావ్.. అంటూ మరికొందరు పచ్చి బూతులు మాట్లాడుతూ ,,అసలు అనసూయ ని ఆడదానిగా కూడా మరిచిపోయి మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
కాగా రీసెంట్ గా ఓ నెటిజన్ అన్ని హద్దులు చెరిపేసి పచ్చి బూతులు మాట్లాడుతూ..” అనసూయ ఒక రోజు నీ రేటు ఎంత” అంటూ ..” అదే ఒక్క షో కి ఎంత తీసుకుంటావు” అంటూ వెటకారంగా ప్రశ్నించాడు. దీని అర్థం అందరికీ తెలిసిందే. అతను పరోక్షకంగా అనసూయని తప్పుడు అర్థం వచ్చేలా అడిగాడు. కానీ అర్థం బయటికి రానికుండా దాని కవర్ చేస్తూ.. షోకి అంటూ కవర్ చేశాడు, దీనిపై అనసూయ చాలా ఎమోషనల్ గా కామెంట్ చేసింది . అంతేకాదు ఒక్క ఆన్సర్ తో దిమ్మ తిరిగిపోయేలా చేసింది.
“చాలా లోకువ కదండి మీకు నేనంటే. అదే మీ చెల్లిని లేక భార్యను ఇలా అడుగుతారా,..? అదే మీ రేటు ఎంత అదే అండి ఆఫీస్ లో అని వాళ్ళని అడిగితే ఏం చెప్తారు..?” అంటూ చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇవ్వకనే ఇచ్చింది. దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .కాగా ఈ విషయంలో చాలా మంది తప్పు అనసూయది అంటున్నారు. ఆమె కామ్ గా ఉండి.. ఆ ట్వీట్ చేయకుండా ఉంటే అసలు ఇంత గొడవ మొదలయ్యేదే కాదంటున్నారు. మరి చూడాలి ఈ వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందో..?