సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం ఆ తరవాత డేటింగ్ లు చేయడం చాలా కామన్. ఆ తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటారు లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. కానీ అతి తక్కువ మంది మాత్రమే డేటింగ్ చేయకుండా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటారు. తరవాత ఎలాంటి వివాదాలు లేకుండా కలిసి మెలిసి ఉంటూ ఇతర సెలబ్రిటీ జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి జంటల్లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, హీరోయిన్ నజ్రియా నాజిమ్ జంట కూడా ఒకటి.
ఫహద్ పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. లాక్ డౌన్ లో ఫహద్ నటించిన కొన్ని మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అవ్వడం ఓటిటి లో రిలీజ్ అవ్వడం తో ఇక్కడ కూడా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దాంతో పాన్ ఇండియా లెవల్ లో ఫహద్ కు అవకాశాలు వస్తున్నాయి. నజ్రియా విషయానికి వస్తే రాజారాణి సినిమాతో నజ్రియా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. రీసెంట్‌గా నజ్రియా కూడా నేచురల్ స్టార్ నాని అంతే సుందరానికి సినిమాతో నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
అయితే నజ్రియా – ఫాహద్ ఇద్దరు భార్య భర్తలు అన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. నజ్రియా ఫస్ట్ సినిమా బెంగుళూరు డేస్….ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా లో ఫహద్ నజ్రియా కు భర్త గా నటించాడు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ సమయం లో నజ్రియా వయసు కేవలం 18 సంవత్సరాలే. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. విచిత్రం ఏంటంటే నజ్రియా మళ్లీ గ్యాప్ వస్తే తమ ప్రేమకు రెండు కుటుంబాల నుంచి ఎక్కడ అభ్యంతరాలు వస్తాయో ? అని వెంటనే పెళ్లికి ఓకే చెప్పేసింది.
దాంతో వీరిద్దరూ వెంటనే పెళ్లి చేసుకున్నారు. ఇక నజ్రియాకు ఆమె భర్త ఫహద్ కు 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. నజ్రియా 19 ఏళ్ల వయసులోనే ఫహద్‌ను పెళ్లి చేసుకుంది. కాగా ఫహద్ ఎక్కడ మిస్ అవుతాడో అని తాను చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్నా అంటూ నజ్రియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక ప్రస్తుతం ఈ జంట సినిమా ఇండస్ట్రీ లోనే లవ్లీ కపుల్ గా ఉంటూ ఆదర్శంగా ఉంటోంది.