Moviesప్ర‌భుదేవా ఆ కండిష‌న్లు పెట్ట‌డం వ‌ల్లే న‌య‌న‌తార బ్రేక‌ప్ చెప్పిందా..? ఏంటా...

ప్ర‌భుదేవా ఆ కండిష‌న్లు పెట్ట‌డం వ‌ల్లే న‌య‌న‌తార బ్రేక‌ప్ చెప్పిందా..? ఏంటా కండిష‌న్స్..?

సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న అందాల తార‌ల్లో న‌య‌న‌తార ఒక‌రు. మ‌త్తు క‌ళ్ల సుంద‌రి న‌య‌న‌తార అందంతోనే కాకుండా న‌ట‌న‌తోనూ అభిమానుల‌ను సంపాదించుకుంది. సౌత్ ఇండియ‌న్ లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. తెలుగుతో పాటూ త‌మిళ స్టార్ హీరోల‌కు న‌య‌న‌తార జోడీ క‌ట్టింది. ఏకంగా 17 ఏళ్ల పాటు ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన‌సాగ‌డం అంటే మామూలు విష‌యం కాదు.
ప్ర‌స్తుతం సీనియ‌ర్ హీరోల‌తో పాటూ పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌లో నటిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.

ఇక రీసెంట్ గా త‌మిళ ద‌ర్శ‌కుడు విగ్నేశ్ శివ‌ణ్ ను న‌య‌న్ పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి పెళ్లికి సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రై కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు. న‌య‌న్‌కంటే వ‌య‌స్సులో విఘ్నేష్ యేడాది చిన్నోడు. వీరిద్ద‌రూ పెళ్లికి ముందు చాలా కాలం పాటూ డేటింగ్ కూడా చేశారు. అయితే విఘ్నేష్ తో ప్రేమాయ‌ణానికి ముందు న‌య‌న‌తార కొరియోగ్రాఫ‌ర్, ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవాతోనూ ప్రేమాయ‌ణం న‌డిపించింది. ప్ర‌భుదేవాకు పెళ్లై పిల్లలు ఉన్న స‌మ‌యంలో అత‌డితో న‌య‌న్ ల‌వ్ ఎఫైర్ న‌డిపింది.

న‌య‌న్ వ‌ల్ల‌నే ప్ర‌భుదేవా త‌న భార్య‌కు విడాకులు ఇచ్చాడ‌ని కూడా కోలీవుడ్ లో వార్త‌లు వినిపించాయి. ఆ స‌మ‌యంలో ప్ర‌భుదేవా భార్య ర‌మ‌ల‌త్ న‌య‌న్‌కు శాప‌నార్థాలు కూడా పెట్టేసింది. న‌య‌న్ ప్ర‌భుదేవాతో క‌లిలి చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగింది. ప్ర‌భుదేవాతో పెళ్లి త‌ర‌వాత సినిమాల‌కు సైతం గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకుంది. అంతే కాకుండా 2011 టైంలో న‌య‌న్ – ప్ర‌భుదేవా పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలారు. అదే స‌మ‌యంలో శ్రీరామ‌రాజ్యం సినిమాలో న‌టించిన న‌య‌న్ షూటింగ్ చివ‌రిరోజున ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు పాదాభివంద‌నం చేసి ఇకపై తాను సినిమాల్లో న‌టించ‌న‌ను అని క‌న్నీళ్లు కూడా పెట్టుకుంది.

క‌ట్ చేస్తే ప్ర‌భుదేవా న‌య‌న‌తార బ్రేక‌ప్ చెప్పుకున్నారు. అయితే ప్ర‌భుదేవా… న‌య‌న‌తార బ్రేక‌ప్ చెప్పుకోవ‌డానికి ప్ర‌భుదేవా పెట్టిన కొన్ని కండిష‌న్స్ కార‌ణమ‌ని తెలుస్తోంది. ప్ర‌భుదేవా పెళ్లి త‌ర‌వాత సినిమాలు వ‌ద్ద‌ని చెప్ప‌డంతో న‌య‌న్ ఓకే చెప్పింద‌ట‌. ఆ త‌ర‌వాత ప్ర‌భుదేవా క్రిస్టియ‌న్ గా ఉన్న న‌య‌న్ ను త‌న మ‌తంలోకి మారాల‌ని కోర‌గా అదికూడా చేసింద‌ట‌. ఆ తర‌వాత ప్ర‌భుదేవా ఆధిప‌త్యం చెలాయిస్తూ మ‌రికొన్ని కండిష‌న్స్ పెట్టాడ‌ట‌.

అలాగే న‌య‌న‌తార ఆస్తులు కొన్ని ప్ర‌భుదేవా పేరుపై ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేసింద‌ట‌. ఆ త‌ర్వాత ప్ర‌భుదేవా తీరులో మార్పు రావ‌డంతో విసిగిపోయిన న‌య‌నతార ప్ర‌భుదేవాతో ఉండేలేక బ్రేక‌ప్ చెప్పేసింద‌ట‌. అలా ప్ర‌భుదేవాకు బ్రేక‌ప్ చెప్పిన న‌య‌న్ ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్‌తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. వీరి ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో చూడాలి మ‌రి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news