Moviesనయనతార అందుకు పనికిరాదు..తొందరపాటుతో తప్పుడు నిర్ణయం..!!

నయనతార అందుకు పనికిరాదు..తొందరపాటుతో తప్పుడు నిర్ణయం..!!

ఇకపై నయనతార అలాంటి పాత్రలతో సరిపెట్టుకోవాల్సిందేనా..? అంటే దాదాపు ఇదే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. జూన్ 9వ తేదీన నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్‌ని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా హీరోయిన్స్ పెళ్ళి చేసుకున్న తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమవుతారు. ఆ తర్వాత అక్క అమ్మ వదిన పాత్రలతో రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటారు. వీరిలో కూడా చాలా తక్కువమందికే మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే అవకాశం లభిస్తుంది.

పెళ్ళి, పిల్లలు వల్ల ఫిజిక్‌లో చాలా మార్పులు వస్తాయి. దాంతో మేకర్స్ పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే, ఇక్కడ నయనతారకు కలిసొచ్చే విషయం ఏమిటంటే విగ్నేష్ దర్శక, నిర్మాత. కాబట్టి హీరోయిన్‌గా కంటిన్యూ అవడానికి నయన్‌కి కలిసొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి కమిటవుతుంది. ఇప్పటికే, చేసిన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తున్నాయి. అయితే, నయన్ ఇకపై హీరోయిన్‌గా కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

ఇది కూడా తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా టీజర్ చూస్తే అర్థమవుతుంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరో. సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. నయన్ కూడా ఇందులో ఓ పాత్రను పోషించింది. అయితే, అది హీరోయిన్ పాత్ర కాదు. న‌యనతార రేంజ్‌కి అలాంటి పాత్ర చేయాల్సిన అవసరం కూడా లేదు. అయినా ఒప్పుకుంది.

ఇది బలంగా ఉంటే గాడ్ ఫాదర్ సినిమా నయన్‌కి ప్లస్ అవుతుంది. లేదంటే ప్రాధాన్యత లేని సినిమా చేసిందని మిగిలిపోయింది. అంతేకాదు, ఇప్పుడు హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ మూవీ చేస్తోంది. ఇది తప్ప భారీ చిత్రం అది కూడా హీరోయిన్‌గా ఇంకా ఏదీ కన్‌ఫర్మ్ కాలేదంటున్నారు. అందుకే, ఇకపై నయనతారకి హీరోయిన్ పాత్రలకంటే కూడా ఏదో కీలక పాత్రలు మాత్రమే దక్కుతాయని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పాత్రలతో ఇండస్ట్రీలో ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news