అన్నగారు.. ఎన్టీఆర్ సినీ రంగంలో అనేక పాత్రలు పోషించారు. అనేక మాధ్యమాల్లోనూ ఆయన అనుభవం ఉంది. దీంతో ఆయన మేకప్ ఆయనే వేసుకునేవారు. అదే సమయంలో కొన్ని కొన్ని విషయాలు.. ఆయనే స్వయంగా చూసుకునేవారు. అంతేకాదు..కొన్ని కొన్ని సందర్భాల్లో దర్శకుడి పాత్రను కూడా ఆయనే పోషించేవారు. చిన్న చిన్న పాత్రలకు.. ఆయనే మేకప్ సూచనలు చేసేవారట. ఇలానే.. కొన్ని కొన్ని పాత్రలకు.. ఆయనే డైలాగులు సూచించేవారట.
అదే సమయంలో అగ్గిబరాట, లక్ష్మీకటాక్షం వంటి సినిమాల విషయంలో కాస్ట్యూమ్స్ అంశానికి సంబంధిం చి దర్శకులతోనూ.. అన్నగారు.. చర్చించేవారు. ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ అలా.. ఉంటే బాగుంటుంది.. ఇలా ఉంటే బాగుంటందనే చర్చ సాగేది. ఆయన ప్రత్యక్ష ప్రమేయం పెద్దగా లేకపోయినా.. దర్శకులు వచ్చేలోపే.. అన్నగారు.. కొన్ని కొన్ని విషయాల్లో జోక్యం చేసుకునేవారు. లోకేషన్‌కు వెళ్తే.. ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటించేవారు.
ముఖ్యంగా.. సర్దార్ పాపారాయుడు సినిమా సమయంలో మన్యం ప్రాంతానికి షూటింగుకు వెళ్లినప్పుడు.. అన్నగారు అక్కడి అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా ఫారెస్టు అధికారులను వెంటబెట్టుకుని తిరిగిన సంద ర్భాలు.. వారితో కలిసి.. ఫొటోలు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా దర్శకుడి కన్నా.. ముందే.. ఈ పాత్ర ఇలా చేస్తే బాగుంటుంది… ఈ డైలాగు ఇలా చెబితే బాగుంటుంది.. అనే చర్చలు చేసేవారట.
అంటే.. మొత్తంగా అన్నగారి దృష్టి అంతా.. ఈజ్ ఆఫ్ యాక్టింగ్‌పై ఎక్కువగా ఉండేదని అంటారు. అందుకే..ఆయన సినిమాలు.. నటనకు కాకుండా.. జీవానికి ప్రాధాన్యం ఇస్తుంటాయి. అంటే.. ఎక్కడా మనకు నటించినట్టు కనిపించదు.. జీవించినట్టే కనిపిస్తుంటుంది.